సంజీవని

ఎముకలు గుల్లబారితే కష్టమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు పెరిగే కొద్ది ఎముకలు గుల్లబారి సులువుగా విరిగిపోవడాన్ని ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. ఈ వ్యాధి శరీరములో సైలెంటుగా ఉండి, రోగ లక్షణాలు ఏమీ అగుపడకుండానే చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవడం జరుగుతుంది. ఒకప్పుడు ‘ఆస్టియోపోరోసిస్’ వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే సమస్యగా భావించేవారు. కాని మారిన జీవనశైలి విధానంవల్ల సరియైన పోషకాహారం తీసుకోక, వ్యాయామం చేయటానికి వీలుకాక, ఎక్కువసేపు కదలకుండానే విధులను నిర్వర్తించవలసి రావటంతో.. ఊబకాయం కూడా తోడై ‘ఆస్టియోపోరోసిస్’ సమస్య ఈ రోజుల్లో యుక్తవయసులోనే వస్తోంది.
ఎముకలు పలుచబడి బోన్ మినరల్ డెన్సిటీ తగ్గి ఎముక పటుత్వాన్ని కోల్పోయి తేలికగా ఎముకలు విరగడం జరుగుతుంది. ఈ ఫ్రాక్చర్ ఎక్కువగా మణికట్టు (రిస్ట్), తొంటి (హిప్స్), వెన్నుఎముకల దగ్గర ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఎముకలు విరిగినవారిలో 80 శాతంమంది ఆస్టియోపోరోసిస్ వలననే ఎముకలు విరుగుతున్నాయి. వీరిలో మహిళలే అధికంగా వున్నారు.
ఎముక ల పటుత్వం సాధారణంగా 25 సంవత్సరములనుండి 40 సంవత్సరముల వరకు బాగా ఉంటుంది. 40 సంవత్సరముల తర్వాత ఎముకల పటుత్వం తగ్గిపోవుట ప్రారంభమవుతుంది. సుమారుగా 70 సంవత్సరముల వయసు కలిగిన వారిలో ఎముక పటుత్వం చాలా తగ్గిపోతుంది. ఈ వయస్సులోనే చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోతుంటాయి. పురుషులకంటే స్ర్తిలు ఎముక పటుత్వం తక్కువగా కోల్పోయి ఉంటారు. కావున వయసు మళ్లిన ఆడవారిలో ఫ్రాక్చర్స్ ఎక్కువగా వుంటాయి. ఎందుకనగా వీరిలో బహిష్టులు ఆగిన అనంతరం ఈస్ట్రోజన్ హర్మోన్ ఉత్పత్తి తగ్గిపోవటంవలన ఎముకలు పటుత్వం తగ్గిపోతుంది.
కారణాలు
- కాల్షియం, విటమిన్ డి తక్కువ కావటం
- అధిక బరువు, వ్యాయామం లేకపోవటం
- మద్యపానం, ధూమపానం అధికంగా సేవించడం
- కొన్ని వ్యాధులకు వాడే స్టిరాయిడ్స్ వలన
రోగ నిర్థారణ
చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం, తరుచుగా ఎముకలు నొప్పిగా ఉండటం, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు ఉండటం.
పరీక్షలు: బోన్ మినరల్ డెన్సిటీ ఎస్టిమేషన్, ఎక్స్‌రేలు మరియు రక్తపరీక్షలు
జాగ్రత్తలు
- కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
- మద్యపానం, ధూమపానం మానివేయాలి.
- బరువున్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.
- పెద్ద పెద్ద బరువులు మోయడం మానివేయాలి
- సరైన పాదరక్షలు వాడాలి (హైహీల్స్ వాడటం తగ్గించాలి)
- వయసు పైబడినవారు చేతి కర్రను ఉపయోగించాలి.
- అధిక బరువు వ్యాయామాలు చేయకూడదు. సాధారణ వ్యాయామాలు మాత్రమే నిత్యం చేయాలి.
- ఇంటి ఆవరణలు, బాత్‌రూముల్లో జారుడు స్వభావం లేకుండా చూసుకోవాలి.
- సూర్యరశ్మి తగిలేటట్లుగా ఉదయం ఎండలో నడవటం చేయాలి.
చికిత్స: హోమియో వైద్యంలో ‘ఆస్టియోపోరోసిస్’కి మంచి చికిత్స కలదు. వ్యాధి లక్షణాలను మరియు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని వ్యాధి ప్రారంభ దిశలోనే మందులను ఎన్నుకొని వైద్యం చేసిన ‘ఆస్టియోపోరోసిస్’ నుండి విముక్తి పొందవచ్చు.
మందులు
ఫాస్ఫరస్: ఎముకలు పటుత్వం కోల్పోయి ఆస్టియోపోరోసిస్ సమస్యను ఎదుర్కొనేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వీరు చూడటానికి బలహీనంగా పొడవుగా వంగిపోయి ఛాతి పలుచగా అగుపడతారు. మానసికంగా మాత్రం చురుకుగా ఉంటారు. వీరు తేలికగా ఆందోళన పడిపోతుంటారు. సున్నిత మనస్కులు, ఇటువంటి శరీరక, మానసిక లక్షణాలున్నవారికి ఈ మందు ఆలోచించదగినది.
కాల్కేరియా కార్బ్: ఆస్టియో పోరోసిస్ సమస్య వలన వీరు కుర్చీలో సరిగా కూర్చోలేరు. కీళ్ళ నొప్పులు, క్రాంప్స్ రాత్రి పూట ఎక్కువగా ఉంటుంది. వీరు చూడటానికి లావుగా వుంటారు. వీరి పొట్ట ముందుకు పొడుచుకొని వచ్చి బోర్లించిన మూకుడులాగా ఉంటుంది. తల పెద్దదిగా ఉంటుంది. చూడటానికి లావుగా కనిపిస్తారు కాని ఫిజికల్ ఫిట్‌నెస్ ఏ మాత్రం ఉండరు. మందకొడితనం, బద్ధకంతో వుంటారు. వీరికి తలమీద చెమటలు ఎక్కువగా వస్తుండటం గమనించదగిన లక్షణం. తల క్రింద తలగడ పెట్టుకుంటే దిండు మొత్తం తడిగా మారుతుంది. వీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి శారీరక, మానసిక లక్షణాలున్నవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది.
కాల్కేరియా ఫాస్: కాల్షియం లోపం ఎక్కువగా వుండి నడుము నొప్పితో బాధపడే వారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వీరికి వెన్ను నొప్పి చిన్న చిన్న కదలికలకే ఎక్కువవుతుంది. వీరు చూడటానికి శుష్కించినట్లుగా అగుపడతారు. ఎముకలు విరిగితే సరిగా త్వరగా అతుక్కోక ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి. అలాగే ఈ మందు ఎముకల పటుత్వాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
కాల్కేరియా ఫ్లోర్: వీరికి ఎముకలలో కంతులు ఏర్పడుతుంటాయి. అలాగే దీర్ఘకాలికంగా నడుమునొప్పితో బాధపడేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వీరికి కదలికలు నొప్పుల నుండి ఉపశమిస్తాయి.
మెర్కుసాల్: గనేరియా, సిఫిలిస్ వ్యాధులను అణగదొక్కడంవల్ల ఆస్టియోపోరోసిస్ వస్తే ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
థైరాయిడినం: ఆస్టియోపోరోసిస్ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఈ మందు వాడటం వలన కాల్షియం, ఫాస్ఫరస్ మెటబాలిజం సరిగా ఉండి, బోన్ డెన్సిటీ తగ్గకుండా సక్రమంగా ఉండే విధంగా కాపాడుతుంది.
ఈ మందులే కాకుండా సైలీషియా, నైట్రోమోర్, రూటా, కాల్కేరియా కార్బ్, సల్ఫర్, హైపరికం, మాగ్‌ఫాస్, సింఫైటినం, లైకపోడియం వంటి మందులను లక్షణ సముదాయాన్ని పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల ఆస్టియోపోరోసిస్ నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646