సంజీవని

హైఫీవర్ జ్వరం కాదు ఎలర్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలర్జిక్ రియాక్షన్‌తో శ్వాసించడంలో వచ్చే ఇబ్బంది హైఫీవర్ అంటారు. దీనినే ఎలర్జిక్ రైనిటిస్ లేక పోలెనోసిస్ అని కూడా అంటారు. పుష్పాలనుంచి గాలిలో ఎగురుతూ వచ్చే పొలైన్ గ్రెయిన్స్- పుప్పొడి శ్వాసనాళంలోకి ప్రవేశించడంవల్ల సాధారణంగా ఈ ఎలర్జీ కలుగుతూ వుంటుంది. దుమ్ము, కుళ్లిపోయిన ఆకులు, చెత్తా చెదారంలోని ఫంగస్ వల్ల కూడా రావచ్చు. జంతువుల వెంట్రుకలు, ఈకలు, ఉలెన్‌నుంచి వచ్చే సన్నటి పోగులు గాలి ద్వారా అటు ఇటూ సంచరిస్తూ మనం తీసుకునే గాలితోపాటు ముక్కు ద్వారా శ్వాసనాళంలోకి ప్రవేశించి హైఫీవర్‌ను కలిగించవచ్చు.
ఇలాంటివాటికి సెన్సిటివ్ అయినపుడు, అలాంటి వాతారణంలో వున్నంతకాలం ఈ ఎలర్జీతో బాధపడుతుంటారు. చర్మంమీద కూడా ఎర్రదనంతో ఈ ఎలర్జీ కనిపిస్తుంటుంది. మీ గృహ వాతావరణంలోని రకరకాల పదార్థాలకి మీ రియాక్షన్‌ను నోట్ చేసుకుని డాక్టర్‌కి చూపించండి. వీటి ఆధారంగా చర్మ పరీక్షలు చేస్తారు. ప్రతీ ఎలర్జిన్‌ని- ఎలర్జి కలిగించే పదార్థాన్ని చర్మంమీద కొద్దికొద్దిగా పెట్టి పరీక్ష చేస్తారు. దేనితో చర్మం ఎర్రనవుతుందో అది ఎలర్జీ కలిగిస్తుందన్నమాట.
ఎలర్జీ కలిగించేవాటికి దూరంగా వుండడం మంచిది. ఇంట్లో కర్టెన్లు, దుప్పట్లు, మరికొన్ని వస్తువులమీద దుమ్ము పేరుకుపోయే ప్రమాదం వుంది. అందువల్ల ఆ ప్రాంతాలలో దుమ్ము పేరుకుపోకుండా తరచూ వాటిని శుభ్రపరచుకుంటూ వుండాలి. అలాగే నేలమీద పరిచే తివాచీలలో కూడా దుమ్ము పేరుకుపోతూంటుంది. వాక్యూమ్ క్లీనర్‌లాంటివాటితో దుమ్ము, ధూళి లాంటి పదార్థాల్ని తీసివేస్తుండాలి. అలాగే, అన్ని గదులలోకి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకుంటుండాలి. ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు ఎక్కువగా వుంటే పుప్పొడి వచ్చే కాలంలో ఆ ప్రాంతాలకు దూరంగా వుండాలి. అలాగే పెంపుడు జంతువులకు, పక్షులకు దూరంగా వుండాలి. వైద్యులు యాంటీ హిస్టమిన్ వాడమనచ్చు. అధిక రక్తపోటున్నవారు ఇంకా జాగ్రత్తగా వుండాలి. అవసరమైతే ఇమ్యూనోథెరపీ ఇస్తారు. హైఫీవర్ తీవ్రతను బట్టి చికిత్స చాలాకాలం ఇవ్వాల్సి రావచ్చు.

-డా మోహన్‌రెడ్డి.. నోవా ఇఎన్‌టి క్లినిక్, పంజగుట్ట, హైదరాబాద్.. 9635552444