సంజీవని

రుతుస్రావం ఓ సహజ స్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలలో రుతుస్రావం ఒక సహజమైన శరీర ధర్మం. అందులో రహస్యమైనదేదీ లేదు. ఈ రోజులలో కూడా కొందరు స్ర్తిలు రుతుస్రావాన్ని ఓ జబ్బుగా.. ఓ దురదృష్టంగా భావిస్తున్నారు.
వివాహిత అయిన ప్రతి స్ర్తి తను ఎప్పుడు బహిష్టు అయినది రాసి పెట్టుకోవాలి. బహిష్ఠు ఆగిపోవడం గర్భానికి చిహ్నం. అలాగే పనిచేసే స్ర్తిలు రుతు సమయాన్ని రాసుకుని ఉంటే ఆ కాలంలో ఇబ్బందినెదుర్కోవచ్చు. రుతుస్రావ కాలంలో పనిచేయకుండా ఉండడం మంచిది.
ఆ కాలంలో మనఃస్థితిలో కూడా మార్పు కనిపిస్తుంది. తేలికగా అలసిపోవడం, నిద్రారాహిత్యం, కించిత్ స్తన్యవృద్ధి- రుతుస్రావానికి ముందుగాని, రుతు సమయంలోగాని ఏర్పడవచ్చు. హార్మోన్ల ప్రభావంవల్ల ఇవన్నీ కలుగుతాయి. వీటిని సహజ లక్షణంగా భావించాలి. ఇవి హఠాత్తుగా సంభవించినా అసాధారణంగా అతిగా ఏర్పడినా గైనకాలజిస్ట్‌ని కలవడం అవసరం.
రుతుస్రావ కాలంలో ప్రతిరోజూ స్నానం చేయడంవల్ల ప్రమాదం లేదు సరికదా మంచిది కూడా. రుతుస్రావ కాలంలో స్వేదగ్రంథులు, హార్మోన్ల ప్రభావంవల్ల తీవ్రంగా పనిచేస్తుంటాయి. అందుకని చర్మ రక్షణ కోసం రోజూ స్నానం చేయడం మంచిది. రుతుస్రావ స్వీకరణ కోసం ఉపయోగించే వస్తువులు క్రిమిరహితంగా ఉండాలి. రుతుస్రావం అసాధారణం కాదు. భయపడాల్సిన పనిలేదు.

డా.విజయలక్ష్మి గైనకాలజిస్ట్.. 9849022441