సంజీవని

ఫుట్టుకతో గుండె జబ్బులు శాపం కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టుకతోనే గుండె లోపాలతో పిల్లలు పుడుతున్నారు. గుండె గదుల్ని వేరు చేసే గోడ లోపాలతో ఎక్కువమంది పిల్లలు పుడుతున్నారు. పైన రెండు గదులమధ్య, అలాగే క్రింది గోడల మధ్య గోడలకు కంతలతో పిల్లలు పుడుతుంటారు. అలాగే గుండె కవాటాల ఇబ్బందులతోను పిల్లలు పుడుతుంటారు. అలాగే, రక్తనాళాల అమరికలో మార్పులతోను పుడుతుంటారు.
చాలా గుండె లోపాల్ని శిశువు తల్లి గర్భంలో వున్నపుడే గుర్తించి శస్తచ్రికిత్సలతో సరిచేస్తున్నారు. కాబట్టి గర్భిణులు లెక్కప్రకారం వైద్యులకు చూపిస్తూ వాళ్ళ సలహాలని తీసుకుంటూ ఉండడం అవసరం.
పిండం పెరిగేప్పుడు దెబ్బలు తగిలి, కొన్ని మందులు వాడడంవల్ల కూడా గుండెకి ఇబ్బందులు కలగవచ్చు. అందుకని దెబ్బలు తగలకుండా చూసుకోవటం అవసరం. వైద్య సలహా లేకుండా ఎటువంటి మందుల్ని వాడకూడదు. గర్భిణిలు డయాబెటిస్ వున్నా, అధిక రక్తపోటు ఉన్నా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చినా, రుబెల్లా వచ్చినా, తల్లికి మద్యం అలవాటున్నా, ధూమపాన అలవాటున్నా గర్భంలోనే శిశువు గుండెకి చేటు జరిగి లోపాలు కలగవచ్చు. ఒక పాప గుండె లోపాలతో పుడితే మరో పాప గుండె లోపాలతో పుట్టే అవకాశముంది. కాబట్టి గర్భంలో ఉండగానే కొన్ని లోపాల్ని సరిచేయవచ్చు. లేకపోతే పుట్టిన తర్వాత సరిచేయవచ్చు. ఇప్పుడన్ని రకాల గుండె జబ్బులకూ చికిత్స ఉంది. సకాలంలో వైద్యుణ్ణి కలవడం అవసరం.

-డా రవికుమార్ ఆలూరి
గుండె, రక్తనాళాల వైద్య నిపుణులు
కిమ్స్, కొండాపూర్, హైదరాబాద్.. 9848024638

-డా రవికుమార్ ఆలూరి