సంజీవని

కీళ్ల ఇబ్బందులకు యోగాతో చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: నా వయసు 32 సంవత్సరాలు. నా బరువు 90 కిలోలు. నేను వృత్తిరీత్యా కంప్యూటర్ జాబ్ చేస్తున్నాను. నేను కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. నేను చికిత్స నిమిత్తం దగ్గరలో వున్న పెద్ద ఆసుపత్రికి వెళ్లగా వారు ఎక్స్‌రేలు తీసి ఆస్టియో ఆర్థరైటిస్‌గా నిర్థారించినారు. నాకు కీళ్ళనొప్పి ఉదయం నిద్ర లేచిన మొదటి కదలికలో అధికంగా వుండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉంటుంది. రాత్రిపూట బాధలు ఎక్కువగా ఉంటాయి. చల్లటి, తేమతో కూడిన వాతావరణం సరిపడదు. కూర్చొని పైకి లేవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. నడుస్తున్నప్పుడు చిన్న చిన్న శబ్దాలు రావడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పిగా ఉండడం జరుగుతుంది. నా సమస్యకు సరైన హోమియో మందును సూచించగలరు.
-రాజేష్, విజయవాడ
జ: ఆస్టియో ఆర్థరైటిస్ అనునది కీళ్ళ చివరలో వున్న మృదులాస్థి (కార్టిలేజ్) క్షీణించడంవలన వస్తుంది. మృదులాస్థి (కార్టిలేజ్) అనునది రెండు ఎముకల మధ్య ఉండి ఒక కీళ్లు మరొక కీళ్లు తాకకుండా కుషన్‌లాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మృదులాస్థిలో మార్పు రావడం వలన కీళ్లలో వాపుతోపాటు నొక్కి ఎక్కువగా ఉండి కదలిక కష్టంగా మారుటనే ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటాము. ఒకప్పుడు కీళ్ళనొప్పులు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే సమస్యగా భావించేవారు. కాని మారిన జీవనశైలి విధానంవల్ల సరియైన పోషకాహారం తీసుకోక, వ్యాయామం చేయటానికి వీలుకాక, ఎక్కువసేపు కదలకుండానే నిధులను నిర్వర్తించవలసి రావటం ఊబకాయం కూడా తోడై కీళ్ళ సమస్యలను అతి చిన్న వయసులోనే ఎదుర్కొనవలసి వస్తుంది.
మీ సమస్యకు రస్‌టాక్స్ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సిలో మీరు 15 రోజులకు ఒక్కసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున రెండు నెలలపాటు వాడండి. అలాగే అధిక బరువు తగ్గడానికి వ్యాయామం, యోగా నిత్యం చేయాలి. ముఖ్యంగా ఉప్పు, వంటలలో నూనెను తగ్గించాలి. మాంసాహారం, వెంటనే మానివేసే ప్రయత్నం చేయాలి.