సంజీవని

రుతుక్రమం గతి తప్పితే అవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకాలంలో పీరియడ్స్ రాకపోడాన్ని వైద్య పరిభాషలో ‘ఎమోనోరియా’ అని అంటారు. ఎమోనోరియా రెండు రకాలుగా చెప్పవచ్చు.
1.ప్రైమరీ ఎమోనోరియా 2.సెకండరీ ఎమోనోరియా
ప్రైమరీ ఎమోనోరియా: రజస్వల అయ్యే వయస్సులో అనగా 16 నుంచి 17 సంవత్సరాలు వచ్చినా రజస్వల కాకపోవడాన్ని ప్రైమరీ ఎమోనోరియా అంటారు.
కారణాలు: పిట్యూటరి గ్రంథి లోపం లేదా జననేంద్రియాల్లో మార్పువల్ల కొన్ని సందర్భాలల్లో మానసిక వ్యాధులవల్ల కూడా ప్రైమరీ ఎమోనోరియాకు గురికావచ్చు.
సెకెండరీ ఎమోనోరియా: పీరియడ్స్ కొన్ని రోజులు మధ్యలో ఆగిపోయి నెలల తరబడి రాకపోవడాన్ని వచ్చి సెకండరీ ఎమోనోరియా అంటారు. గర్భధారణ జరగకుండా సుమారుగా 4 నెలలు పీరియడ్స్ రాకపోతే సెకండరీ ఎమోనోరియా గుర్తించాలి.
కారణాలు
- హార్మోన్ల అసమతుల్యత
- సరియైన ఆహారం తీసుకోకపోవటంచే శరీర పటుత్వం కోల్పోవటం వలన
- గర్భనిరోధక పిల్స్ అధికంగా వాడటంవలన
- జన్యుపరమైన లోపాలు
కాల్కేరియా కార్బ్: స్థూలకాయంతో ఉండి, శరీర పటుత్వం లేకుండా ఉంటుంది. తలలో చెమటలు ఎక్కువగా ఉంటాయ. రక్తము తక్కువగా ఉంటుంది. మలబద్ధకంతో బాధపడుతుంటారు. పని చేసినా ఆటలు ఆడినా వీరు తేలికగా అలసిపోతుంటారు. యుక్త వయస్సు వచ్చినా రజస్వల కాని పిల్లలకు ఈ మందు బాగా పనిచేస్తుంది. పై లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
కాలీకార్బ్: వీరికి లేటుగా మెనె్సస్ వస్తాయి. వీరు చూడటానికి బొద్దుగా, లావుగా కనిపిస్తారు. వీరికి తెల్లవారు జామున మూడు గంటలకు కడుపునొప్పి ఎక్కువగా ఉంటాయి. ఒంటరిగా ఉండటానికి భయపడుతుంటారు. ఆందోళనవల్ల ఛాతిలో దడగా వుంటుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ఉపయోగం.
పల్సటిల్లా: వీరు రక్తహీనతతో బాధపడుతుంటారు. యుక్తవయస్సులో మహిళలకు వచ్చే సమస్యలకు ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వీరికి పిరియడ్స్ వచ్చే ముందు బాధలు ఎక్కువగా ఉంటాయి. వీరు మానసిక స్థాయిలో చంచల స్వభావాన్ని కలిగివుంటారు. అనగా ఎప్పుడూ ఏడుస్తుంటారు. మరలా రెండు మంచి మాటలు చెప్పగానే నవ్వేస్తుంటారు. అలాగే వీరు తమ బాధలను చెప్పుకుంటూ ఏడ్చేస్తుంటారు. తేలికగా దుఃఖానికి గురై కంట తడి పెడుతుంటారు. ఇటువంటి లక్షణాలున్నప్పుడు ఈ మందు వాడుకోదగినది.
సెపియా: వీరికి మెనె్సస్ తక్కువగా అవుతాయి. ఒకటి, రెండు రోజులు మాత్రమే మెనె్సస్ అగుపడుతుంది. కొన్ని సందర్భాలల్లో రక్తస్రావానికి బదులుగా వైట్ డిశ్చార్జి అగుపడుతుంది. వీరికి తల తిప్పుడు, నీరసం, చెమటలు పట్టడం, పొత్తికడుపులో నొప్పి, ఏ పని పట్ల ఆసక్తి లేకపోవటం, రక్తం తక్కువగా వుండి పాలిపోయినట్లుగా అగుపించేవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
సైలీషియా: వీరిలో పెరుగుదల లోపం ఉండి ఎదుగుదల అగుపించదు. మలబద్ధకంతో బాధ పడుతుంటారు. చర్మంమీద గుల్లలు గడ్డలు నిత్యం ఏర్పడుతూ ఉంటాయి. జననేంద్రియాలు దురదపెడుతూ ఉంటాయి. మానసిక స్థాయిలో కుంగిపోయి ఉంటారు. ఇలాంటి లక్షణాలున్నవారు ఈ మందు వాడుకోవచ్చు.
ఈ మందులే కాకుండా ఫెర్రంమెట్, గ్రాఫైటిస్, సెనిసియా, ఎలట్రిస్, కాల్కేరియా ఫాస్, టుబర్క్యులినం లాంటి మందులను లక్షణ సముదాయమును అనుసరించి వాడుకుంటే ఎమోనోరియా సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646