సంజీవని

ప్రశ్న-జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భుజాలలో ‘డిస్‌లొకేట్’ అయింది అంటారు. ‘డిస్ లొకేషన్’ అంటే ఏమిటి?
- కీళ్లలో ఎముకలు ఓ పద్ధతిలో ఉంటాయి. అవి ఆ పద్ధతిని వదిలి ప్రక్కలకు జరగడానే్న ‘డిస్‌లొకేషన్’ అంటారు. ఇది భుజాలలో ఎక్కువగా కలుగుతుంటుంది. చేతుల్ని బాగా చాచి ఆటలు ఆడినా- మరే పని చేసినా ‘డిస్‌లొకేషన్’ కలుగుతుంటుంది. తీవ్రమైన నొప్పి ఉంటుంది. వాపు వస్తుంది. చేయి కదలికలు కష్టమవుతాయి. భుజాల దగ్గర ఆకారంలో మార్పు కనిపిస్తుంది. వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్‌ని కలవాలి. ఆయన స్థానభ్రంశమైన ఎముకల్ని సరిచేస్తారు.
ఆటల్లో ‘టెండినైటిస్’ అని అంటుంటారు? అంటే ఏమిటి?
- కండరాల్ని ఎముకల్ని పట్టి ఉంచే సన్నని తాళ్ళలాంటి టెండాన్స్ ఉంటాయి. ఈ టెండాన్స్ ఇన్‌ఫ్లమేషన్‌ని ‘టెండినైటిస్’ అంటారు. ఆ ప్రాంతంలో వాస్తుంది. కదలికలు కష్టమవుతాయి. ఆ ప్రాంతంలో ఐస్‌పేక్‌ని ఉంచాలి. ఇబుఫ్రిన్, యాస్పిరిన్ లాంటి నొప్పి తగ్గే మందులు వేసుకోవాలి.
టెండాన్స్‌కి, లిగమెంట్స్‌కి తేడా ఏమిటి?
- ఎముకల్ని, కండరాల్ని కలిపి ఉంచే గట్టి సన్నటి ఎలాస్టిక్ తాళ్ళు లాంటివి టెండాన్స్ ఎముకని పట్టి ఉంచే బలమైన బాండ్స్ ‘లిగమెంట్స్’. అవయవాల్ని తీవ్రంగా వాడినప్పుడు టెండాన్స్, లిగమెంట్స్- రెండూ చిరిగిపోవచ్చు. తిరిగి అవి సరిగ్గా పునర్నిర్మాణం అయ్యేదాకా ఇబ్బందే!

-డా సాయి లక్ష్మణ్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్.. 9704500909