సంజీవని

పిల్లల్లో ఆస్తమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదేళ్ళలోపు చిన్నారుల్లో ఆస్తమా సమస్య ప్రస్తుతం తల్లిదండ్రులను కలవరపెడుతున్నది. అకస్మాత్తుగా రాత్రివేళల్లో ఛాతీ నొప్పి, తోటి పిల్లలతో ఆడుకుంటూనే కుప్పకూలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులపట్ల తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అవగాహనా లోపం కూడా కారణమని వైద్యులు పేర్కొన్నారు. శాలిని శర్మ అనే తల్లి తన ఎనిమిదేళ్ల బాబు విష్ణుకు అర్థరాత్రి ఛాతిలో నొప్పి రావడంతో ఆగమేఘాలమీద ఆసుపత్రికి తీసుకెళ్లి ఆస్తమా సోకిందని వైద్యుడు నిర్థారించడంతో షాక్‌కు గురికావడం ఆమె వంతైంది. శ్వాసలో గురక పెడుతున్నపుడు ఆటలు ఆడటంతోపాటు ఎదుగుతున్న వయస్సుని సర్దిచెప్పుకున్నట్లు ఆమె పేర్కొంది. అయితే ఆమె ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలను వైద్యుడు నివృత్తిచేశారు. ఆమె మాదిరిగానే చాలామందికి ఆస్తమా లక్షణాలు, తీవ్రత తెలియక నిర్లక్ష్యం చేస్తుంటారని, పరిస్థితి విషమిస్తే నియంత్రణ కష్టసాధ్యంగా మారుతుందన్నారు.
ఇతర వ్యాధుల మాదిరిగానే ఆస్తమా పట్ల నిర్లక్ష్యం, తప్పుడు అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది దీన్ని మానసిక సమస్య అని కాలానుగుణంగా తగ్గిపోతుందని విశ్వసిస్తారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చివరి అవకాశం ‘ఇన్‌హేలర్’ వాడకమే. ఆస్తమా వ్యాధి చికిత్సకు వైద్యులు చేసిన సూచనలను రోగులు గానీ, వారి తల్లిదండ్రులుగానీ పట్టించుకోరు. ఆ విధానంవల్ల ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనన్న తప్పుడు అభిప్రాయాలు కలిగివుంటారు. శ్రీయ అనే అమ్మాయి ఆస్తమా రోగి. ఆడుకుంటున్నపుడు అకస్మాత్తుగా దగ్గుతూ పడిపోయింది. ఆమెను చికిత్స కోసం వైద్యుడి వద్దకు తీసుకెళ్ళినపుడు .. సదరు వైద్యుడు సిఫారసు చేసిన చికిత్సా విధానాన్ని పాటించడం లేదని తేలింది. ఆమె వద్ద ఇన్‌హేలర్ అందుబాటులో లేనందువల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇన్‌హేలర్ వాడకంతో స్టెరాయిడ్స్ శరీరంలోకి వెళ్లి పాప ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అనుమానించినట్లు శ్రీయ తండ్రి తెలిపారు.
హైదరాబాద్‌లోని లోటస్ చిల్ట్రన్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ వంశీధర్ కేదార్ మాట్లాడుతూ- నా దృష్టికి వచ్చిన పలు కేసుల్లో ఆస్తమా, దానికి చికిత్సపై ప్రజల్లో పలు రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అత్యధిక స్థాయిలో తప్పుడు అవగాహన కలిగి ఉండటమే విషాదకరం. కనుక ఆస్తమాపై తప్పుడు ఆలోచనలకు తెరదించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రాణాలు పోవుగాని నయం కావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల ప్రాణానికి ముప్పు ఉందన్న ముఖ్యమైన సంగతి గుర్తుపెట్టుకోవాలి. రోగుల జీవనశైలిని ఎలా మెరుగుపర్చడం అన్నదే ప్రధానం అని అన్నారు.
ఆస్తమా వ్యాధి బాలల్లో చాలా దీర్ఘకాలిక వ్యాధి. ప్రతిఏటా దీని బారిన పడుతున్న చిన్నారులు పెరుగుతూనే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) సర్వే ప్రకారం భారత్‌లో 5-11 ఏళ్ళ మధ్య వయస్కుల్లో 10-15 శాతంమంది బాలల ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇంటర్నేనల్ స్టడీ ఆఫ్ ఆస్తమా అండ్ అలర్జీస్ ఇన్ చైల్డ్‌హుడ్ (ఐఎస్‌ఎఎసి) అంచనా ప్రకారం ఆరేడు ఏళ్ళలోపు బాలల్లో 30,043మందికి 3.7 శాతం, 13-14 ఏళ్ళలోపు బాలల్లో 37,171 మందికి 4.5 శాతం ఆస్తమాతో బాధపడుతున్నారు. ఫార్మకాలజీకల్ చికిత్స కొనసాగుతున్నా, వైద్యులు -తల్లిదండ్రులమధ్య సమాచార మార్పిడి లోపం, అవగాహనా లోపం వల్ల పిల్లల్లో ఆస్తమా సమస్య ఎక్కువగా ఉంటున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. డాక్టర్ వంశీధర్ కేదార్ ఇంకా మాట్లాడుతూ, ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించినపుడు సమర్థవంతమైన చికిత్స విధానం అమలుకు తల్లిదండ్రులు ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించారు. ఇన్‌హేలల్ విధానంలో వాడే కార్టిస్టెరాయిడ్స్‌వల్ల ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. కార్టిస్టెరాయిడ్స్‌తో కూడిన ఇన్‌హేలర్ అందరికీ ఆమోదయోగ్యమేనని ఆయన సూచించారు. దీనివల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం చాలా తప్పని అన్నారు. ఓరల్ మెడికేషన్‌తో కూడిన చికిత్స చాలా సమయం తీసుకుంటుందని వివరించారు.