సంజీవని

పోషకాహారం లోపిస్తే కష్టమే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ఆర్థికంగా బలంగా వుండేవాళ్ళలో ఆహారం అధికంగా తీసుకుని అనారోగ్యాల్ని కొనితెచ్చుకుంటూ ఉంటారు. వైట్ కాలర్ జాబ్స్.. ఆఫీసులలో పనిచేసే వాళ్ళలోకన్నా కాయకష్టం చేసేవాళ్ళకు రోజూ కేలరీలు ఎక్కువగా కావాలి.
రోజంతా కాయకష్టం చేసేవాళ్ళకి రోజుకి 2400 కేలరీల శక్తినిచ్చే ఆహారం కావాలి. కార్యాలయాల్లో పనిచేసేవాళ్లకి రోజుకి 1800 కేలరీలు సరిపోతాయి. ఆహారం ఎక్కువ తీసుకుంటే కొవ్వు రూపంలో శరీరంలో నిలువ ఉంటుంది. బరువు పెరుగుతారు. బాడీ మాస్ ఇండెక్స్ కన్నా ఎక్కువ బరువున్న కొద్ది ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
ప్రపంచ జనాభాలో 30 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువ ఉన్నారు. వీళ్ళకి, గర్భిణీలకు, చిన్న పిల్లలకు, వ్యవసాయ కూలీలకు అవసరమైన పోషకాహారం దొరకడంలేదు. మార్బిడిటి రేటు, శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రసవానంతరం జాగ్రత్తలూ సరిగా తీసుకోవడంలేదు.
ఆహారంలో ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలతోబాటు నీళ్ళలో కరిగే బి, సి విటమిన్లు, కొవ్వులలో కరిగే ఎ, డి, ఇ విటమిన్లు తీసుకోవాలి. నీటిలో కరిగే విటమిన్లు ఎక్కువైనా పర్లేదు. మూత్రంలో వెళ్లిపోతాయి. కొవ్వులలో కరిగే విటమిన్‌లను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. నీళ్ళ విరేచనాలు, తలనొప్పి కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మన ఆహారంలో మైక్రో న్యూట్రియెంట్స్, మినరల్స్ కూడా లభించాలి. కాల్షియమ్, కాపర్, బోరాన్, సిలికాన్, మాలిబ్ధియమ్ కనీస స్థాయిలోనైనా ఆహారంలో లభిస్తుండాలి. అలా లభించకపోతే రకరకాల జబ్బులు వస్తాయి.
మైక్రోన్యూట్రియంట్స్, శరీరంలోని కణాలలో జరిగే ఆక్సిడేషన్, రిడక్షన్ లాంటి రసాయన ప్రక్రియలలో కేటలిస్టులుగా పనిచేస్తాయి. ఇవి ఏ మాత్రం దొరకని ఆహారం తీసుకుంటుంటే చిన్న చిన్న రుగ్మతలు తొందరగా తలమీద జుట్టు ఊడడం, చిన్నతనంలోనే వెంట్రుకలు తెల్లబడటం, చర్మం తెల్లమచ్చలు పడడం, చర్మం దళసరవడం లాంటి ఇబ్బందులు కలుగుతాయి.
ఒక్కో పదార్థం శరీరానికి ఒక్కోవిధమైన కేలరీలనిస్తుంటాయి. ఇవన్నీ కలిగివున్న ఆహారమే పోషకాహారం. ఇది అందరికీ లభ్యమవ్వాలి. లేకపోతే కావలసినంత శక్తి లేక వాళ్ళు ఇబ్బంది పడడమే కాదు, దేశ ఉత్పాదనా శక్తి తగ్గుతుంది.

డా.ఆలూరి విజయలక్ష్మి గైనకాలజిస్ట్.. 9849022441