సంజీవని

ఫండుగ విందులతో జాగ్ర త్త...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిస్సారమైన జీవితాల్లో వినోదాన్ని, ఉల్లాసాన్ని తీసుకువచ్చేవి పండుగలు. దాదాపుగా మన పండుగలన్నీ కూడా ఉపవాసం, విందులతో సంబంధం కలిగి వుంటాయి. అధికంగా ఆహారం తీసుకోవడం, లేదంటే అసలేమీ తీసుకోకపోవడం ఈ పండుగల వేళ సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ పండుగల వేళ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడమన్నది అసాధ్యంగానే కనిపిస్తుంది. కానీ కొద్ది ప్రయత్నం చేస్తే ఈ పండుగ స్ఫూర్తిని వీలైనంత ఎక్కువగా ఆస్వాదించవచ్చు.
పండగ సీజన్‌లో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సలహాలు
1.రోజువారీ మీరు వాడే మందులు, ఇన్సులిన్‌ను తప్పనిసరిగా వాడాలి.
2.ఎట్టి పరిస్థితుల్లోనూ మందులను వాడటం మరువద్దు.
3.రెగ్యులర్ డైట్ ప్రణాళికను అనుసరించాలి.
4.తియ్యదనంతో కూడిన అధిక కార్బోహైడ్రేట్ స్వీట్లకు బదులుగా పళ్లతో చేసిన స్వీట్లను ఎంచుకోవడం మంచిది.
5.అధిక కార్బోహైడ్రేట్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవద్దు.
6.ఒకేసారి అధికమొత్తంలో ఆహారం తీసుకోవడం కాకుండా కొద్ది మొత్తంలో మాత్రమే తీసుకోవాలి.
7.వీలైనంత వరకూ ఉపవాస దీక్షలు చేయవద్దు.
8.మీ శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవాలి.
9.వ్యాయామాలు చేయడం ఆపవద్దు.
10.తియ్యటి డ్రింక్స్‌ను దూరంగా ఉంచడం మరువద్దు.
తియ్యటి రుచుల వెనుక ఒత్తిడి కూడా వుంటుంది. ఈ తియ్యటి పదార్థాలను తిని మనమీద మనం ఒత్తిడి పెంచుకోవద్దు!

-డా.మేనక రాంప్రసాద్ కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్