సంజీవని

మనసున మనసై...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవనగమనంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులు మానవ మానసిక సమతుల్యతలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వేగవంతమైన ఈనాటి ఈ సామాజిక, సాంకేతిక మార్పులు ‘మనిషి’ మనస్సుపై తీవ్రమైన ‘ఒత్తిడి’ పెంచుతూ అనేకానేక శారీరక, మానసిక రుగ్మతలకు నిలయాలుగా మారుతున్నాయి! నానాటికీ పెరుగుతున్న ఈ శారీరక అనారోగ్యాలకు ప్రధానంగా మానసిక దౌర్బల్యాలే కారణం అనటంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. మారుతున్న సామాజిక, సాంఘిక అంశాలు సంస్కృతి, నాగరికతా విధానాలలో వస్తున్న మార్పులు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాలు, పెరిగే కోరికలకు తగిన విధంగా పెరగని ఆర్థిక వనరులు, అనవసర పోటీతత్వంతో పెరుగుతున్న అసూయ, ద్వేషాలు, ప్రశాంతత కొరవడి ఉద్వేగ, ఉద్రేకాలు రెచ్చగొట్టే బుల్లితెర, పెద్దతెర వినోదాలు మనిషి మనస్సుపై జోడు గుర్రాల సవారి చేస్తున్నాయి.
నిరాశా, నిస్పహ, మానవ సంబంధాలలో పటిష్టత లోపించడం లాంటివి మనస్సును సున్నితంగా మార్చి చిన్న చిన్న విషయాలకే ఉద్వేగ, ఉద్రేకాలకు లోను చేసి చాలా సందర్భాలలో హత్యలు, ఆత్మహత్యలు లేదా ఉన్మాద ప్రవర్తనలకు కారణాలుగా మారుతున్నాయి. సమస్త జీవరాసులలో అత్యున్నతమైన మనిషి ‘మనీషి’గా ఎదగవలసిన క్రమం గతి తప్పి నేటి ఒత్తిడి వాతావరణంలో ఇటు మందులకో లేదా ఆత్మహింసలకో మానసిక స్థితి చేరుకోవటం నిజంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల విచ్చలవిడితన వినియోగం మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. వేగంగా మారుతున్న ఈనాటి ఈ సమాజంలో మానసిక ఒత్తిళ్ల విషయంలో ఏ వయస్సువారికి మినహాయింపు లేదు. అందరు ఈ ‘మనసు’ బాధితులే.
ప్రవర్తనా లోపాలు, ఒంటరితనం, నిరాశా నిస్పృహలతో కొట్టుకుపోతున్న యువతకు కావాల్సిన మానసిక భరోసా అందించే అవకాశాలే మృగ్యమవుతున్నాయి. ఆత్మన్యూనత నుండి ఆత్మవిశ్వాసంలోకి, ఒత్తిడి, కుంగుబాటుల నుండి చైతన్యంలోకి సున్నితత్వం నుండి సమస్య ఎదుర్కోగలిగే స్థైర్యంలోకి అపజయాలనుండి విజయాలలోకి సాగే దిశగా కానె్వంట్ స్థాయినుండి యూనివర్సిటీల స్థాయిలవరకు మానసిక పరిణతి పెంచే బోధనలు జరగాలి. ఇది ప్రతి ఉపాధ్యాయుడి కనీస బాధ్యతగా దానికి తగ్గ శిక్షణ, కాలమాన పరిస్థితులకి తగ్గట్టు జరగాలి. ముఖ్యంగా రేపటి భవిష్యత్‌లో వున్నత విలువలతో మార్గదర్శకంగా నిలబడవలసిన యువత మానసిక పరిణితికి స్ఫూర్తిని అందించాలి.

-డా.అమరనాథ్ జాగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్.. 9849545257