సంజీవని

ప్రశ్న-జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: నా వయస్సు 35 సంవత్సరాలు. నేను ఒక కంపెనీలో కంప్యూటర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నాను. నాకు కొంతకాలంగా మెడ కదిలించటంవల్ల నొప్పి అధికమవుతున్నది. విశ్రాంతి వల్ల నొప్పి తగ్గుతోంది. అలాగే మలబద్ధకంతో బాధపడుతుంటాను. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా త్రాగుతాను. మానసికంగా నాకు కోపం ఎక్కువ. కదలికలవల్ల నాకు బాధలు ఎక్కువవుతున్నాయి. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, కుడి చెయ్యి పైకి ఎత్తడం కష్టంగా మారుతున్నది. దగ్గరలో వున్న డాక్టర్‌ని సంప్రదించగా ఎక్స్‌రే తీసి స్పాండిలోసిస్ సమస్యగా నిర్థారించి మెడ పట్టి పెట్టుకోమన్నారు. మెడ పట్టి పోయే మార్గం లేదా.. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
-జయ, కరీంనగర్
జ: మీ సమస్యకు ‘బ్రయోనియా’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో మీరు 15 రోజులకు ఒకసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు నెలలపాటు వాడగలరు. అలాగే కాల్కేరియా ఫ్లోర్ 6 ఎక్స్ అనే మందును రోజుకు 4 మాత్రలు మూడుసార్లు చొప్పున రెండు నెలలు వాడగలరు. ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలెజ్ క్షీణించి, ఆస్టియోఫైట్స్ ఏర్పడటంవలన వస్తుంది. కావున స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం మానుకోవాలి. అలాగే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం వున్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం నివారించుకోవాలి. నొప్పి తీవ్రత తగ్గించుకోవటానికి అతిగా పెయిన్ కిల్లర్స్‌ను వాడకూడదు. నీరు సరిపడినంతగా త్రాగాలి. తాజా కూరగాయలు నిత్యం ఆహారంలో ఉండే విధంగా తీసుకోవాలి.
చర్మం పొడిబారిపోయి ఉంటుంది
ప్ర:నా వయసు 45 సంవత్సరాలు. నేను కొంతకాలంగా ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. ఈమధ్య కాలంలో నాకు ఉన్నట్టుండి చర్మ వ్యాధి మొదలైంది. చర్మం పొడిబారిపోయి పగుళ్లు దళసరిగా మారడం, చర్మం నలుపు రంగులోకి మారడం, దురద ఎక్కువగా ఉండి నీరు లాంటిది కారడం వంటి సమస్యతోబాధపడుతున్నాను. నా సమస్యకు సరైన మందును సూచించగలరని మనవి.
-హరిశంకర్, హైదర్‌గూడ

జ: మీ సమస్యకు ‘గ్రాఫైటిస్’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో వారానికి ఒక రోజు ఉదయం, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు వారాలపాటు వాడగలరు. పౌష్టికాహారం, తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా విటమిన్ సి ఉన్నవి తీసుకోగలరు.
అధిక రుతుస్రావం అరికట్టేది ఎలా?
ప్ర:నా వయస్సు 33 సంవత్సరాలు నాకు రుతుస్రావం నెల పొడవునా వస్తుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. కొన్నిసార్లు రుతుక్రమం సరిగానే ఉంటుంది. నా సమస్యకు మార్గం చూపగలరు.
-ఓ సోదరి, నల్లగొండ
జ: మీ సమస్యకు ‘క్రోకాస్’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పొటెన్సీలో వారానికి ఒక రోజు ఉదయం, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు వారాలపాటు వాడగలరు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646