సంజీవని

మానసిక స్థాయిలో గందరగోళం పోయేది ఎలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: నా వయస్సు 43 సంవత్సరాలు. నేను ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా పనిచేస్తున్నాను. నేను ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా, ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఏదైనా పని తలపెట్టినా మానసిక స్థాయిలో గందరగోళంలో డిప్రెషన్‌కు గురై ఆందోళన చెందుతున్నాను. నాకు రెండు సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
-రాజు, వరంగల్
జ: డిప్రెషన్‌కు ప్రధాన కారణాలు మెదడులోని కొన్ని న్యూరోట్రాన్స్‌మీటర్ల స్థాయి తగ్గటం, బాహ్య పరిస్థితుల ప్రభావంవలన డిప్రెషన్ మొదలవుతుంది. దీనికితోడు ప్రవర్తనలో లోపాలు, అసహజ వాంఛలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆత్మన్యూనతభావన, పర్సనాలిటీ వ్యాధులు, అనుమానాలు, జన్యుపరమైన కారణాలు, శారీరక సమస్యలు మొదలైన అనేక అంశాలు ‘డిప్రెషన్’ ఉత్పన్నం కావడానికి దోహదపడుతున్నాయి.
మీ సమస్యకు ‘అర్జెంటం నైట్రికం’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో మీరు 15 రోజులకు ఒక్కసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు నెలలపాటు వాడగలరు. దీంతోపాటుగా మానసిక ఒత్తిడి తగ్గటానికి తమ చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మనసుకు నచ్చిన సంగీతం వినటానికి ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉండకుండా మిత్రులతో గడపడటం, నచ్చిన పర్యాటక ప్రాంతాలకు మిత్రులతో కలిసి వెళ్లాలి. అంతర్మధనాలకు దూరంగా ఉండడం, భావోద్వేగాలను, ఆలోచనలను, అభిప్రాయాలను అణచిపెట్టకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయులతో పంచుకోవడం వంటివి చేస్తే డిప్రెషన్ నుండి తొందరగా బయటపడవచ్చు. అలాగే హార్మోనుల సమతుల్యతను కాపాడడానికి మంచి ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తోపాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని అలవరచుకొనుటకు ప్రయత్నం చేయాలి.

నడుము నొప్పితో బాధ..
ప్రశ్న: నా వయస్సు 22 సంవత్సరాలు. నేను బండిమీదినుండి పడటంవలన నడుము ప్రాంతంలో కముకు దెబ్బలు తగలటం జరిగింది. అలాగే శారీరక శ్రమ అనంతరం నడుము నొప్పి వస్తుంది. నడుమునొప్పి తీవ్రంగా ఉండి నడుము ఎటువైపు కదల్చినా వంగినా, కూర్చున్నా నడిచినా నొప్పి తీవ్రత పెరుగుతుంది. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లగా స్కానింగ్, ఎక్స్‌రేలు తీసి ఏమీ కాలేదన్నారు.
-కార్తిక్, విజయవాడ
జ: మీ సమస్యకు అర్నికా అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో మీరు వారం రోజులకు ఒక్కసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున ఒక నెలపాటు వాడగలరు. అలాగే నడుము నొప్పి సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు కనీసం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. వాహనం నడిపేటప్పుడు, కుర్చీలో కూర్చున్న పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరియైన స్థితిలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు బెడ్‌రెస్టు తీసుకోవడం తప్పనిసరి. బల్లమీదగాని, నేలమీదగాని పడుకోవాలి. ముఖ్యంగా స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలలో సరియైన స్థితిలో కూర్చోవాలి. అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం మానుకోవాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పై మందును వాడితే నొప్పి చాలావరకు తగ్గిపోతుంది.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646