సంజీవని

మలబధ్ధకం పోయేదెలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండాపోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్రరూపందాల్చుతుంది.
మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. మానవునికి వచ్చే చాలా రకాల వ్యాధులకు మలబద్ధకమే మూలకారణంగా ఉంటుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కలదు.
ఆధునిక జీవన విధానంలో కొన్ని మార్పులు చేయటం వలన మలబద్ధకం సమస్యను నివారించవచ్చు.
మలబద్ధకానికి కారణాలు
- ఆహారపు అలవాటు సరిగా లేకపోవటం
- కొన్ని రకాల మందులవలన ముఖ్యంగా ఐరన్ టాబ్లెట్స్ అతిగా వాడటం
- తరచుగా తీవ్రమైన ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురికావడం
- వేళకు మలవిసర్జనకు వెళ్ళే అలవాటు లేకపోవడం
- రోజుకు సరిపడినంత నీరు తీసుకోకపోవడం వలన మలబద్ధకం ఏర్పడుతుంది.
లక్షణాలు
- తేన్పులు ఎక్కువగా ఉండటం, మలవిసర్జనకు వెళ్లాలంటే భయంగా ఉండటం.
- గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్టుగా ఉండటం
- కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడం
- మలవిసర్జన సరిగా పూర్తిగా కాదు

- తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం
- జీవన విధానం సక్రమంగా జరుగక మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
జాగ్రత్తలు
పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటిపండ్లు, పైన్‌ఆపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరగా సాఫీగా జరుగుతుంది.
- ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాల్ మానివేయాలి.
- నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి.
- నీరు సరిపడినంత తాగాలి. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి.
- మానసిక ఒత్తిడిని నివారించడానికి యోగా, వ్యాయామం, ప్రాణాయామము, మెడిటేషన్ వంటివి నిత్యం చేయాలి.
చికిత్స: హోమియో వైద్యంలో మలబద్ధకంతో బాధపడేవారికి మంచి చికిత్స ఉంది. శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా మందులను ఎంపిక చేసుకొని ఇవ్వడంవలన వ్యాధి సమూలంగా నివారణ అవుతుంది.
మందులు:
నక్స్‌వామికా: మసాలాలు, ఫాస్ట్ఫుడ్స్, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి మలబద్ధకం నివారణకు ఈ మందు బాగా పనిచేస్తుంది.
బ్రయోనియా: వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మలబద్ధకంతో బాధపడుతుంటారు. మలము గట్టిగా వస్తుంది. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగ పెట్టుకొని ఉంటారు. ఇటువంటిలక్షణాలున్నవారికి ఈ మందు వాడుకోదగినది.
ఓపియం: మలవిసర్జన వాంఛ ఉండదు. మలము గట్టిగా నల్లగా ఉండలవలే ఉంటుంది. మలబద్ధకంతో బాధపడే ముసలివారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
అల్యూమినా: మలము మెత్తగా వున్న వీరు మలవిసర్జనకు ముక్కవలసి వస్తుంది. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలలో మలబద్ధక సమస్య నివారణకు ఈ మందు వాడుకోదగినది. అలాగే డబ్బా పాలు తాగే పిల్లల్లో ఏర్పడే మలబద్ధకం నివారణకు ఈ మందు బాగా పనిచేస్తుంది.
కాస్టికం: పక్షవాతంవలన మలవిసర్జన సరిగా జరగనివారికి ఈ మందు ప్రయోజనకారి.
ఈ మందులే కాకుండా గ్రాఫైటిస్, సల్ఫర్, సైలీషియా, ప్లంబం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడితే మంచి ఫలితం ఉంటుంది.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646