సంజీవని

సమయానుకూల పరీక్షలతో కొలెరెక్టల్ క్యాన్సర్‌కు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతుల్‌సింగ్ (63)కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేసిన రైల్వే అధికారి. తన పిల్లలను గొప్పవారిని చేయాలని కలలు కన్నారు. కానీ చిన్నపాటి నిర్లక్ష్యం తన జీవితాన్ని ఒడిదుడుకులకు గురిచేస్తుందని అతుల్‌సింగ్ ఏనాడూ ఆలోచించలేదు. ఈ రోజు అతుల్‌సింగ్ చిన్నకూతురు రీటా వివాహం జరుగుతున్నది కానీ, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన అతుల్‌సింగ్ తన చిన్నారి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని వీక్షించే అవకాశం కోల్పోయారు. ఏ రోజుకోసమైతే వేచి చూశానో ఆ క్షణం వచ్చేసరికి నా యువరాణి వివాహ సమయానికి అక్కడ లేను అని కన్నీరు పెట్టుకున్నాడు.
మూడేళ్ల క్రితం అన్నివేళల్లో తాను అలిసిపోతున్నట్టు గుర్తించాడు అతుల్‌సింగ్. కొన్ని నెలలు బరువు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నా పని ఒత్తిడిలో పట్టించుకోలేదు. అతుల్ నిర్లక్ష్యంతో రోజురోజుకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తూ వచ్చింది. మలంలో రక్తం రావడంతో ఆందోళనకు గురైన అతుల్‌సింగ్ వైద్యుడిని సంప్రదించగా కొలెరెక్టల్ కాన్సర్ మూడో దశకు చేరుకున్నదని నిర్థారణైంది. ఈయన ఒక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది పేషెంట్లకు కొలెరెక్టల్ క్యాన్సర్ పట్ల అవగాహన లేదు. అందువల్ల త్వరితగతిన వైద్య పరీక్షల్లో దాని లక్షణాలు తెలుసుకునేందుకు ముందుకు రావడంలేదు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా కాన్సర్ వ్యాధి మరణాల్లో పురుషుల్లో మూడోవంతు, మహిళల్లో సగభాగం కొలెరెక్టల్ కాన్సర్‌వల్లే చోటుచేసుకుంటున్నాయి.
దీనిపై సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రి సర్జికల్ అంకాలజీ, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ జగదీశ్వర్ గజాగ్వోనీ గౌడ్ స్పందిస్తూ పురీషనాళంలోగానీ, పెద్దప్రేగుకు గానీ సోకే క్యాన్సర్‌నే కొలెరెక్టల్ క్యాన్సర్ అంటారు. పెద్దప్రేగులోపల పొర ఎదిగేందుకు చాలా ఏళ్లు పడుతుంది. అనూహ్యంగా బరువు తగ్గుదల, కడుపులో నొప్పి, మలంలో రక్తం, ఎనిమియా, వాంతులు, అలసట కొలెరెక్టల్ కాన్సర్‌కు సంకేతాలు. ప్రారంభ దశలో గుర్తింపుతో సమయానుకూలంగా చికిత్స పొందొచ్చు. విచారకరమేమిటంటే, చాలామంది ప్రజానీకం కొలెరెక్టల్ కాన్సర్‌వల్ల తలెత్తే ముప్పు తీవ్రత గురించి తెలియక నిరంతర చెకప్‌లకు దూరంగా ఉంటారు. ఈ పరిణామం వ్యాధి ప్రమాదకర స్థాయికి చేరుకునేందుకు దారితీస్తుందంటారు.
నైట్‌షిప్ట్, మధుమేహం, భౌతిక శ్రమ లేకపోవడంవల్ల కొలెరెక్టల్ కాన్సర్ ముప్పు పెరిగే అవకాశముంది. ఊబకాయం, పౌష్టికాహార లోపం, మద్యపానం, ధూమపానం కూడా దీనికి కారణాలు. కుటుంబంలోని ఇతర సభ్యులకు వచ్చినా అది ప్రభావం చూపే అవకాశముంది. కొలెరెక్టల్ కాన్సర్ వస్తే పెద్ద ప్రేగును శస్తచ్రికిత్స ద్వారా తొలగించాల్సిన పరిస్థితి కూడా తలెత్తుతుంది. పట్టణీకరణ కూడా కొలెరెక్టల్ క్యాన్సర్ పెరిగిపోవడానికి మరో కారణం. 30 ఏళ్ళ వయసునుంచి ప్రతి ఐదేళ్లకు ఒకసారి కొలెరెక్టల్ కాన్సర్ గురించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కొలనోస్కోపీ ద్వారా వ్యాధిని గుర్తించిన తర్వాత శస్తచ్రికిత్స ద్వారా మాత్రమే కాన్సర్ సోకిన ప్రాంతాన్ని తొలగించడమే పరిష్కారమార్గం. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సురక్షితమైన సమర్థవంతమైన చికిత్సా విధానం లాపరోస్కోపిక్ సర్జరీ అందుబాటులో ఉందన్నారు. దీనివల్ల తక్కువ నొప్పితోపాటు త్వరితగతిన కోలుకోవడం, కొద్దికాలం పాటు మాత్రమే ఆసుపత్రిలో బస చేయాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు.