సంజీవని

కౌమారంలో ఇలా ఉంటే మేలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌమార ధశలో బాల బాలికలు ఏర్పరచుకునే ప్రవర్తనారీతులు జీవితాంతం కొనసాగుతాయి. అవి వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆధునిక నాగరికత, సంస్కృతి ప్రస్తుత సమాజానికి, ముఖ్యంగా యువత, కౌమార బాలలకు కొన్ని జీవన శైలుల్ని అలవాటు చేస్తున్నాయి. కొన్ని ప్రవర్తనలు, ఆహారపుటలవాట్లు, సత్వర ఫలితాల ఆకాంక్ష, సౌఖ్యానే్వషణ, ఒత్తిడి కౌమార బాలల్ని మత్తుపదార్థాల వ్యసనం, హింస, లైంగిక ప్రయోగాలు చెయ్యడం అనే ‘అపవిత్ర త్రయానికి’ బానిసలుగా మారుస్తున్నాయి.
మరొకవైపు ఇప్పటివరకు వారికి ఆసరాగా నిలిచిన సమిష్టి కుటుంబం, సంప్రదాయక ఆలోచనా సరళి, ప్రవర్తన, సమిష్టితత్వం మొదలైనవి దూరమై వారు విపరీతమైన ఒత్తిడికి, నిస్పహకు, గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిణామం పెరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య, హింసాత్మక ఘటనల రూపంలో ప్రదర్శితవౌతూంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి, ఈనాటి యువత తమ జీవితపు అవసరాల్ని తీర్చుకోవడానికి, సంక్లిషతల్ని ఎదుర్కోవడానికి అవసరమైన జీవన నైపుణ్యాలు, మార్గాల గురించి బోధన తప్పనిసరిగా జరగాలి.
జీవన నైపుణ్యలంటే నిత్య జీవితపు డిమాండ్‌లను, సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులను సన్నద్ధం చేసే సానుకూల ప్రవర్తనలు, సర్దుబాట్లు, దృఢ వైఖరులు. కౌమార దశలో జీవన నైపుణ్యాలు అత్యధికంగానూ, సునిశితంగానూ అభివృద్ధి అవుతాయి.
కౌమార బాలలు పెంపొందించుకోవలసిన జీవన నైపుణ్యాలు
దృఢంగా లేక స్థిరంగా చెప్పగలిగే నైపుణ్యం
వ్యక్తులు ఇతరుల హక్కుల్ని గౌరవిస్తూనే తమ భావాలను, అవసరాల్ని వ్యక్తపరచాలి.
భారతీయ సంస్కృతిలో చాలామంది దృఢంగా చెప్పరు. పురుషులు, స్ర్తిలు కూడా తమ భావాల్ని దృఢంగా చెప్పాలి. నిజాయితీగా ఉండడం, తమ భావాల్ని, అవసరాల్ని సూటిగా, అలవోకగా వ్యక్తపరచడం, శరీర హావభావాల్లో స్థిరత్వం తన గురించి మాట్లాడడం, తన భావాలు, అవసరాల బాధ్యతలను తీసుకోవడం దృఢ ప్రవర్తనలో భాగం. వద్దు లేక నో అని చెప్పవలసివచ్చినపుడు అవును, సరే, అలాగే అని చెప్పడానికి కారణం దృఢంగా చెప్పగల నేర్పు లేకపోవడమే.
కౌమారదశ దృఢంగా చెప్పే నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు కీలకమైన దశ. ఈ దశలో కౌమార బాలలు వివిధ ప్రవర్తనలను, అలవాట్లను స్నేహితుల ఒత్తిడితో అలవరచుకుంటారు. తమ స్వతంత్ర వ్యక్తిత్వ నిరూపణ కోసం, స్నేహితులతో సంఘీభావాన్ని ప్రకటించడం కోసం తాము ‘నో’ అని చెప్పవలసిన సందర్భంలో కూడా ఎస్ అంటూ లొంగిపోతారు.
దృఢంగా చెప్పగలిగే నైపుణ్యం లేనపుడు అది-
- మత్తు పదార్థాలు, మద్యం, జూదం మొదలైన వ్యసనాలకు
- విలువల్ని ధిక్కరించడం, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లడం
- క్లాస్‌రూమ్‌లో అవిధేయతతో, పొగరుగా, లెక్కలేనట్లు ప్రవర్తించడం
- ఆడపిల్లల్ని వేధించడం, ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లడం
- బూతు చిత్రాల్ని చూడడం
- లైంగిక ప్రయోగాలు చేయడం
మొదలైన సంచలనాత్మక ప్రవర్తనలకు దారితీస్తుంది.
కౌమారబాలలు ‘దృఢంగా చెప్పడానికి’, ‘దూకుడుగా చెప్పడానికి’ మధ్య తేడాను అర్థంచేసుకోవాలి. దృఢంగా వ్యవహరించే వ్యక్తి తన అభిప్రాయాలు, అవసరాలు, హక్కుల గురించి స్పష్టత ఉండి వాటిని స్థిరంగా, స్పష్టంగా వ్యక్తీకరిస్తాడు. కాని దూకుడు వ్యవహారంలో వ్యక్తి ఇతరుల హక్కులలోకి బలవంతంగా జొరబడతాడు.
దృఢ ప్రవర్తన గౌరవించబడుతుంది. మెరుగైన సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుతుంది.
తిరస్కరించగలిగే నైపుణ్యం
- తనకు నష్టం కలిగించే లేక తనకు ఇష్టం లేని పనులను మొహమాటంతో చెయ్యకుండా వద్దు లేక కాదు అంటూ
- స్పష్టంగా తిరస్కరించగల నేర్పును ప్రతి బాలిక, బాలుడు పెంపొందించుకోవాలి.
- లైంగిక సంబంధాన్ని కోరినపుడు, మద్యం, పొగాకు, మత్తుమందుల్ని తీసుకోమని ఎవరైనా ఒత్తిడి చేసినపుడు నిరాకరించే హక్కు వ్యక్తులకు ఉంటుంది.

డా.ఆలూరి విజయలక్ష్మి గైనకాలజిస్ట్.. 9849022441