సంజీవని

శరీరంలో ఎముకలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన శరీరంలో 213 ఎముకలున్నాయి. పుర్రెలో 22, చెవులలో 6 చాలా చిన్న ఎముకలు, మెడలో ఒక ఎముక, 33 వెన్నుపూసలు, ఒక ఛాతీ ఎముక, 24 ప్రక్కటెముకలు, చేతులలో 64, కాళ్ళలో 62 ఎముకలున్నాయి.
ఎముకలు శరీరంలో ఎందుకు తోడ్పడతాయంటే- శరీర భాగాన్ని కలపడానికి, శరీరానికి ఆకృతినిస్తూ చలనానికి, కొయ్యలా ఉండకుండా అవసరమైన విధంగా శరీర భాగాల్ని కదల్చడానికి ఎమకలు, కీళ్ళు తోడ్పడతాయి. ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలు లాంటి సున్నిత భాగాలను రక్షణ కవచంలా కాపాడుతుంటాయి. కీళ్ళు కదలికలకు తోడ్పడతాయి. ఇవి అరిగిపోయినా, ఎముకలు విరిగినా చాలా ఇబ్బంది కలుగుతుంటుంది.
ఎముకలు నిర్జీవ పదార్థాలు కావు. జీవకణ నిర్మితాలై, ఆ జీవకణాల విభజనవల్ల ఎముక పెరుగుతుంటుంది. ఎముక విరిగితే వీరి భాగాలని జాగ్రత్తగా ఒక చోటికి చేర్చి కలిపి కదలకుండా కట్టుకడితే చాలు, నూత్న శల్వ పదార్థాల్ని ఆ ఎముకలే ఉత్పత్తి చేసుకుని వాటంతటవే కలుస్తాయి. కాకపోతే విరిగిన ఎమకల్ని జాగ్రత్తగా అంతకుముందున్న విధంగా కలపాలి. తప్పుగా అతుక్కుంటే మళ్లీ శస్త్ర చికిత్స చేసి వాటిని సరిగ్గా కలిపి ఉంచాల్సి రావచ్చు.
సాధారణంగా కాల్షియమ్, లవణాలు చేరి కొత్త ఎముక ఏర్పడుతుంటుంది. అందుకని శరీరంలో కాల్షియమ్ లవణాలు తగ్గితే ఇబ్బందే. ఎముకలు పెళుసవుతాయి. చిన్నపాటి వత్తిడులకే ఎముకలు విరుగుతుంటాయి. ఎముకల అగ్రభాగాలు స్పాంజిలాగా బోలుగా ఉంటాయి. దాని నిడువు భాగం సాంద్రంగా ఉంటుంది. స్పాంజి వంటి భాగంలో మజ్జ్ధాతువుంటుంది. అది తెల్ల రక్తకణాల్ని, ఎర్ర రక్తణాల్ని సృష్టిస్తుంది. ప్రతీ నిముషం కొన్ని లక్షల ఎర్ర రక్తకణాలు నశిస్తూ, కొత్తవి పుడుతుంటాయి. ఎముక మధ్య వుండే మజ్జా ధాతువులో కొవ్వు కూడా ఉండి అది అవసరమైనప్పుడు ఆహారంగా తోడ్పడుతుంది.
కాల్షియమ్ కార్బోనేట్, కాల్షియమ్ ఫాస్ఫేట్ ఎముకలు గట్టిగా ఉండడానికి తోడ్పడతాయి. ఎముకలు, కీళ్ళ గురించి అందరికీ కనీస అవగాహన ఉండాలి.

-డా సాయి లక్ష్మణ్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్.. 9704500909