సంజీవని

చుండ్రుతో..బాధ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: నా వయసు 39 సంవత్సరాలు. నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు కొంతకాలంగా తల పొడి పొడిగా వుండి పొట్టు రాలుతూ వుంది. ‘మధ్యరాత్రి’ దురద, తీవ్రమైన మంట వుంటుంది. దయచేసి సరైన మందును సూచించి పరిష్కారం చూపగలరు.
-కరుణాకర్, గుడివాడ
జ: మీ సమస్యకు ‘ఆర్సినిక్ ఆల్బ్’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పొటెన్సీలో మీరు 4 రోజులపాటు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున వాడగలరు. అనంతరం ప్లాసిబో 30 అనే మందును ఉదయం 8, సాయంత్రం 8 గోళీల చొప్పున 15రోజులపాటు వాడగలరు. అలాగే కాల్కేరియాఫాస్ 6 ఎక్స్ అనే మందును రోజుకు 4 మాత్రలు 6సార్లు చొప్పున 2 నెలలు వాడండి. అలాగే హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టికాహారం తీసుకోవాలి. ఎక్కువగా మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఆకుకూరలు, వెజిటబుల్స్ తీసుకోవాలి. తలకు వాడే షాంపూ నూనె, సబ్బులను డాక్టర్ సలహా మేరకే వాడాలి. షాంపూ లేదా ఆయిల్‌ను వెంట్రుకల కుదుళ్లలో వేళ్లతో నెమ్మదిగా ఎక్కువసేపు మర్దన చేయడంవలన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. బయటకు వెళ్లేటపుడు తలకు ‘టోపీ’ ధరించడం మంచిది. కొవ్వు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదు. మానసిక వత్తిడి కూడా చుండ్రుపై ప్రభావం చూపుతుంది. కావున మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు యోగ, వ్యాయామం విధిగా చేయాలి. తగినంత నీరు తాగాలి.