సంజీవని

వృధ్ధుల్లోనూ ఆస్తమా.. భరించలేని బాధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తమా అన్ని వయసులవారిలో వస్తుంది. వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువ బాధిస్తుంది. ఊపిరి ఆడకుండా ఉండి, శ్వాస తీయుట కష్టంగా మారుటనే ఆస్తమా అంటారు. దుమ్ము, ధూళి మరియు వాతావరణ కాలుష్యంతో నేడు అధిక శాతం మంది ఆస్తమా బారిన పడుతున్నారు.
కారణాలు
వంశపారంపర్యంగా, శ్వాసకోశాలు ఇన్‌ఫెక్షన్స్ గురికావడం, ఎలర్జీ, ధూమపానం వల్ల కూడా రావచ్చు.
లక్షణాలు
- శ్వాసనాళాలు ఇన్‌ఫ్లమేషన్‌తో మూసుకొనిపోయి శ్వాసించడం కష్టంగా మారుతుంది.
- ఛాతిలో శే్లష్మం చేరి, పిల్లికూతలు వస్తూ శ్వాస ఆడకుండా కావడం.
- ఛాతి పట్టేయడం, నిద్రలో నుంచి లేచి కూర్చోవడం, దగ్గు రావడం, దగ్గుతోపాటుగా కళ్లె పడటం జరుగుతుంది.
- వ్యాధి తీవ్రత రాత్రి, తెల్లవారు జామున ఎక్కువగా ఉంటుంది.
- తేమ వాతావరణం మరియు వాతావరణంలో వచ్చే మార్పులవల్ల వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది.
జాగ్రత్తలు
- ఆయాసం ఉన్నప్పుడు రోగి వెల్లకిలా పడుకోకుండా, తల ఎత్తులో పెట్టుకొని కూర్చున్న స్థితిలో పరుండాలి.
- చలిగాలిలో బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
- దుమ్ము, ధూళి, వాహన కాలుష్యం మరియు పారిశ్రామిక కాలుష్యానికి దూరంగా ఉండాలి.
- వయసు పైబడినవారు చలిగాలిలో వేకువ జామున తిరగకుండా, కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత బయటకు రావడం మంచిది.
మందులు
యాంటింటార్బ్ - ఛాతిలో శే్లష్మం చేరి బయటకు రాకుండా, ఊపిరి ఆడకుండా చేస్తూ ఆయాసం వస్తున్నప్పుడు ఈ మందు ఆలోచించదగినది. ఛాతిలో నుండి గుర గుర శబ్దాలు వస్తాయ. చల్లటి వాతావరణంలో వీరికి ఆయాసం ఎక్కువవుతుంది. ఇలాంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు.
ఇపికాక్ - ఛాతిలో బరువుగా వుండి, ఊపిరి ఆడకుండా అనిపిస్తుంది. అలాగే వాంతికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. వీరికి కదలికలవలన బాధలు ఎక్కువవుతుంది. ఇలాంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడుకోదగినది.
ఆర్స్ ఆల్బ్ - వీరికి ఆయాసం మధ్యరాత్రి మరియు పగలు ఎక్కువవటం గమనించదగిన లక్షణం. దీంతోపాటుగా వీరికి ప్రాణభయం అధికంగా ఉంటుంది. చెమటలు ఎక్కువగా పడతాయ. అలాగే వీరికి చల్లని పదార్థాలవలన బాధలు ఎక్కువవుతుంది. ఇలాంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడవలసి వుంటుంది.
నేట్రంసల్ఫ్ - వీరికి తడి వాతావరణం గిట్టదు. వీరికి ఆయాసంతోపాటుగా ఛాతిలో గుర గుర శబ్దాలు వస్తుంటాయి. తెల్లవారు జామున ఆయాసం ఎక్కువవుతుంది. వీరి నాలుక పరిశీలించినట్లు అయితే బంగారపు రంగు పూత ఏర్పడి ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ముఖ్యమైనది.
కాలికార్బ్ - వీరికి ఆయాసము తెల్లవారు జామున 3-5 గంటల మధ్య ఎక్కువగుట గమనించదగిన లక్షణం. సంభోగము అనంతరం కలిగే ఆయాసానికి కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఈ మందులే కాకుండా ఆస్పిడోస్పెర్మం, లోబియోలా, శాంభుకస్, స్పాంజియో, కాల్కేరియాకార్బ్, సల్ఫర్, మెడోరినమ్, గ్రిండీలియా, బ్లాటా, సెనేగా, అమ్మోనియా కార్బ్, టుబర్క్యులినయం, ఫెర్రంపాస్, లేకసిస్, కాల్కేరియా కార్బ్ వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడుకుని ఆయాసము ఆస్తమా బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646