సంజీవని

సంతానలేమికి ఇవీ కారణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన యుగంలో ఫోటీతత్వం మనిషిని అనుక్షణం తేరుకోకుండా కాలంతో పరుగులు తీయుస్తుంది. పని ఒత్తిడి మనసు ఎక్కడ కాసేపు నిలకడగా ఉండనీయడం లేదు. ప్రతి క్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం, దీంతో ఆరోగ్యంపట్ల శ్రద్ధ కరవై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు లైంగికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య సంతాన లేమి. నిత్య జీవితంలో మానసిక ఒత్తిడి ఎక్కువ కావడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారింది.
పురుషులలో సంతాన లేమికి కారణాలు
వెరికోజిల్ వంటి సమస్యలు, జనన అవయవాలకు దెబ్బలు తాకడం, జన్యు సంబంధిత వ్యాధులు ఉండడం, శుక్రకణాలు వచ్చే దారిలో అవరోధాలు ఏర్పడడం, హార్మోన్ల సంబంధిత వ్యాధులుండడం. సుఖవ్యాధులు, ఇన్‌ఫెక్షన్‌లు, మద్యపానం, మానసిక ఒత్తిడి, స్మోకింగ్, వెనె్నముకకు గాయాలు కావడం, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వంటివి ప్రధానంగా పురుషులలో కారణాలుగా పేర్కొనవచ్చు.
స్ర్తిలలో సంతాన లేమికి కారణాలు
బహిష్టు సరిగా రాకపోవడం, హార్మోన్ల అసమతుల్యత లోపించడం, మానసిక ఒత్తిడి, పిసిఒడి, అధిక బరువు, ఇన్‌ఫెక్షన్స్, అండం సరిగా విడుదల కాకపోవటం, పిల్లోపియన్ ట్యూబ్స్ మూసుకపోవడం, మాటిమాటికి అబార్షన్ కావడం, థైరాయిడ్ వంటివి స్ర్తిలలో సంతాన లేమికి కారణాలు చెప్పుకోవచ్చు.
పరీక్షలు - పెళ్లి అయి ఒకటి లేదా రెండు సంవత్సరాలు అయినా సంతానం కలుగకపోతే పురుషులకు స్పెర్మ్ అనాలిసిస్, స్ర్తిలకు అబ్దానిమల్ స్కానింగ్, ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఫొలిక్యులర్ స్టడీ లాంటి పరీక్షలు చేయించి సమస్యను తెలుసుకోవచ్చు.
లైంగిక సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే...
మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, పాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్ బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు, వంటి తాజా పండ్లు తీసుకోవాలి.
తీవ్ర మానసిక ఒత్తిళ్ళు హార్మోన్లపై ప్రభావం చూపి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కావున మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తోపాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని అలవరచుకొనుటకు ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఉదయం వేకువ జామున 30 ని. నుండి 45 ని.ల వరకు నడవడంవలన మానసిక ప్రశాంతత ఏర్పడి ఒత్తిళ్ళను అధిగమించవచ్చు.
మందులు - లైకోపోడియం: ఈ మందు యువకుల్లో వచ్చే నపుంసకత్వానికిది ముఖ్యమైనది. అతిగా కామకలాపాల్లో పాల్గొనడంవల్ల, హస్తప్రయోగానికి గురై లైంగిక సామర్థ్యం కోల్పోయిన వారికి ఈ మందు ప్రత్యేకమైనది. వీరు మానసిక స్థాయిలో దిగులుగా, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ద్వేషం, అహం, పిరికితనం కలిగి వుంటారు. ముసలితనం ముందుగానే వచ్చినట్లుగా నుదుటిపై ముడుతలు పడుతాయి. ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే వెంటనే కంటతడి పెడతారు. వీరు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి అంగస్తంభన లోపంతో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలున్నవారు ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు.
నాట్రోమోర్ - శుక్రకణాల సంఖ్య పెంచడానికి, నిద్రలో వీర్యస్కలనం అయ్యేవారికి గతం తలచుకుంటూ బాధపడతారు.
ఫాస్ఫరస్: పెళ్లిఅయి చాలా సంవత్సరాలు గడిచిన సంతాన లేమితో బాధపడేవారికి ఈ మందు బాగా ఉపయోగకరం. వీరికి లైంగిక వాంఛ అధికం. కాని సంభోగించు శక్తిని త్వరగా కోల్పోయి, లైంగిక వాంఛ మాత్రం మిగులుట గమనించదగిన లక్షణం. మానసిక స్థాయిలో వీరు సున్నిత స్వభావులు. ఎదుటివారి సానుభూతిని కోరుకుంటారు. ప్రతిదానికి తేలికగా ఆకర్షితులవుతారు. భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
ఎగ్నస్ కాక్టస్: వీరు పూర్తిగా నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. కామ వాంఛ తక్కువగా ఉండి అంగస్తంభన జరుగదు. అలాగే స్కలనం కూడా తెలియకుండానే తరచుగా జరుగుతుంది. వీరికి సంభోగవాంఛ కూడా ఉండకపోవుట గమనించదగిన లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
అవైనాసెటైవా: నిత్యం మద్యం సేవిస్తూ, సరైన నిద్ర లేక నరాల బలహీనత ఏర్పడి, సంభోగశక్తిని కోల్పోయినవారికి ఈ మందు బాగా ఉపకరిస్తుంది.
సెలిషియా: పెళ్లికిముందు అతిగా శృంగారంలో పాల్గొన్న పెళ్లి తర్వాత వంధత్వం లోనైన వారికి ఇది ఆలోచించదగినది.
తుజా: గనేరియా వచ్చి వీర్యకణాల సంఖ్య తగ్గిపోతే ఈ మందు ఉపయోగం.
సెలీనియం: మానసికంగా కామవాంఛ కోరిక వున్నా శారీరకంగా అంగస్తంభన జరుగక తెలియకుండానే స్కలనం జరిగిపోతుంది. స్కలనం అనంతరం తీవ్ర నీరసంతో బాధపడేవారికి ఈ మందు ఆలోచించదగినది. ఈ మందులే కాకుండా డామియానా, కెలాడియం, ఒనాస్మోడియం, చైనా, పల్సటిల్ల, లేకసిస్, కాల్కేరియా కార్బ్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని బట్టి డాక్టర్ గారి సలహా మేరకు వాడుకుని సంతాన లేమి సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646