సంజీవని

వైధ్యుణ్ణి ఎప్పుడు సంప్రదించాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోగిని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళే ప్రధాన కారణాలలో నొప్పి ఒకటి. నొప్పి లేకపోతే రోగులు వైద్యుడి దగ్గరకు వెళ్ళరు. రోగాలకు సకాలంలో చికిత్స పొందరు.
ఒక్కోసారి రోగ తీవ్రతకు అనుగుణంగా బాధాతీవ్రత ఏర్పడకపోవచ్చు. న్యూరాల్జియాలో బాధ అధికం. కానీ అది రోగికి ప్రమాదకరం కాదు. అయినా బాధకోసమే రోగి, వైద్యుణ్ణి చూస్తాడు. ఆ బాధ తాలూకు ప్రమాదాన్ని వైద్యుడే నిర్థారిస్తాడు.
గాయాలనుంచిగాని, శరీర రంధ్రాల నుంచి గాని రక్తస్రావం జరుగుతుంటే మనల్ని భీతావహుల్ని చేసి తప్పు అంచనాలను వేయిస్తుంది. రక్త మిశ్రీతమైన జఠర రసము పసరుతో కలిసి వున్నదానిని అధికంగా వాంతి చేసుకున్నప్పుడు, రోగి అదంతా రక్తమేనని భయపడవచ్చు. అనేక నెత్తురు గడ్డలవల్ల విరేచనానికి రక్తవర్ణం వస్తే రోగి భయపడకపోవచ్చు. శరీరాంతర్గత రక్తస్రావం అధికంగా జరిగినా కొద్దిపాటి రక్తమే బయటకు రావచ్చు. అంతర్గత రక్తస్రావంలో రక్తమే కనిపించదు. పాలిపోవటం, నిస్త్రాణ, శ్వాసవేగాధిక్యత, గుండె దడ- అంతర్గత రక్తస్రావ చిహ్నాలు- కాబట్టి ఈ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుణ్ణి కలవడం అవసరం. రక్తస్రావం జరుగుతున్నా నిర్లక్ష్యం చేయకూడదు.
రొమ్ము ప్రాంతాలలో, కడుపులో కొన్ని తీవ్ర స్థితులకు లక్షణమైన పిత్తాశయ, మూత్రాంగ, ఆంత్రశూలల్లో కూడా బాధ కలగవచ్చు.
ఇలా రక్తస్రావాన్ని తీసుకుంటే ఇది మూడు రకాలు- గాయం నుంచి వచ్చేది; ముక్కు, నోరు, చెవి, యురెత్రా, రెక్టమ్‌లనుండి వచ్చేది; మల మూత్ర, వాంతి, శే్లష్మాలనుంచి వచ్చేది. జఠరాశయ విద్రాధిలో రక్తనాళం చిట్లడంతో కూడా రక్తస్రావం జరగవచ్చు.
అధిక జ్వరం వస్తే వైద్యుణ్ణి కలవాలి. గాయ తీవ్రతతో అధిక రక్తస్రావము జరుగుతున్నా ఊరుకోకూడదు.
బొబ్బలు, కాల్పులు మరీ ఎక్కువైతే షాక్‌వల్లా మరణం సంభవించవచ్చు.
నీళ్ళలో మునిగినవారికి కృత్రిమ శ్వాస కార్యాన్ని వెంటనే ప్రారంభించాలి. లేకపోతే ప్రమాదం.
విష జంతువులు.. ముఖ్యంగా పాము కుడితే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే చికిత్స చేయించాలి. కావాలనయినా, పొరబాటునయినా విషం తీసుకుంటే ప్రాణ రక్షణకు వెంటనే చికిత్స చేయించాలి.
ఫిట్స్‌వల్ల, మధుమేహంవల్ల, మెదడు ప్రమాదాలవల్ల, మెదడులో రక్తస్రావంవల్లా, విష ప్రయోగాలవల్లా అపస్మారకము కలిగితే వెంటనే వైద్యుడికి చూపించాలి.
శ్వాస వేగంగాను, అవరోధకరంగాను ఉండి పొట్ట, ముక్కు, కళ్లు అధికంగా చలిస్తూ వున్నా వెంటనే వైద్యుడికి చూపించాలి. హృద్రోగాలలో కూడా వెంటనే వైద్యుడికి చూపించాలి.