సంజీవని

చిన్నారుల దత్తతకు ప్రత్యామ్నాయ మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మమత, ఆమె భర్త రాజీవ్ రెడ్డి (పేర్లు మార్పు) వయసులు వరుసగా 34, 38 సంవత్సరాలు. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం వీరికి వివాహం అయింది కానీ గర్భం రాలేదు. వారు ఇన్‌ఫెర్టిలిటీ చికిత్సలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఐవిఎఫ్ మూడుసార్లు ఫెయిల్ కావడంతో వారు మరింతగా నీరసించిపోయారు. హైదరాబాద్‌లోని నోవా ఐవిఐ ఫెర్టిలిటీలో ఉన్న ఫెర్టిలిటీ స్పెషలిస్టులు కనుగొన్నదేమిటంటే, స్ర్తి, పురుష ఫ్యాక్టర్స్ కారణంగా వారికి సంతానం కలగడంలేదని గ్రహించారు. ఈ కారణంగా వారు ఎంబ్రియో (పిండం) డొనేషన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. మమతకు చిన్నారిని ఎత్తుకోవాలని, మాతృత్వపు మధురిమలను చవిచూడాలని కోరుకున్నారు. ఆ కారణం చేతనే ఆ జంట ఆలోచన చేశారు. నేడు, ఆరోగ్యవంతమైన ఓ బాబును పొందారు.
ఎంబ్రియో డొనేషన్ అనేది ఏఆర్‌టి (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ) టెక్నిక్. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా ఇది ప్రాచుర్యం పొందుతోంది. చిన్నారుల దత్తతకు ఓ ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తుంది. అభివృద్ధి చెందిన పిండాన్ని అజ్ఞాత దాతలనుంచి తీసుకుని దానిని గ్రహీత యొక్క గర్భాశయంలో బదిలీ చేస్తారు. తద్వారా ఆ జంట గర్భధారణ అనుభవాలను పొందేందుకు, తమ చిన్నారికి జన్మనిచ్చేందుకు అవకాశం కల్పిస్తారు. పిండంకు ఎలాంటి జన్యుపరమైన సంబంధం జంటతో లేకున్ననూ, పిండదానం అనేది ఒకరు పిండాన్ని దానం చేసుకోవడానికి ఓ మార్గంగా భావిస్తున్నారు. ఎంబ్రియో అడాప్షన్ అనే పదం ద్వారా దీనిని మరింత చక్కగా అర్థం చేసుకోవచ్చు. అయితే, సంప్రదాయ బేబీ దత్తతలా కాకుండా గ్రహీత తాను స్వయగా గర్భం దాల్చడంతోపాటుగా శ్రమించాల్సి వుంటుంది.
డాక్టర్ సరోజ కొప్పాల ఈ విషయం గురించి తెలియజేస్తూ- ‘‘జంటలలో సంతానలేమికి స్ర్తి, పురుష అంశాలు కారణమవుతుంటాయి. భాగస్వాములలో ఎవరో ఒకరికి ఫెర్టిలిటీ సమస్యలు ఉంటే మేం డోనార్ బీజ కణాల ద్వారా చికిత్స చేస్తుంటాం. ఒకవేళ స్ర్తి, పురుషుల బీజ కణాలు అనువుగా లేకపోతే, ఎంబ్రియో డొనేషన్ అత్యంత సౌకర్యవంతమైన చికిత్స విధానంగా మారుతుంది. ఎంతోమంది కపుల్స్ ఐవీఎఫ్/ఐసీఎస్‌ఐ విధానాలను ప్రయత్నించి గర్భం పొందలేకపోతుంటారు. ఈ తరహా కేసులలో దాత అండం, వీర్యకణాల చేత ఫలదీకరించబడిన ఎంబ్రియో ఈ జంటలకు వరప్రదాయినిగా నిలుస్తుంద’’న్నారు.
గ్రహీతల రికార్డుల పరంగా రహస్యాన్ని నిర్వహిస్తారు. ఇది కపుల్స్‌కు ప్రైవసీ, రహస్యాన్ని అందిస్తుంది. అందువల్ల వారు తమ చిన్నారిని సమాజంలో అంగీకరించరనే బాధ పడాల్సిన అవసరం లేదు. ఈ డోనార్ ఎంబ్రియోస్ తరచూ వివాహం అయి ఆరోగ్యవంతమైన చిన్నారులు కలిగిన వ్యక్తుల మాతృజీవకణ, వీర్యదాతల నుంచి వస్తుంది. అందువల్ల డొనార్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్స్ (డిఈటి) విజయశాతం ఇతర ఐవీఎఫ్ సైకిల్స్‌తో పోలిస్తే అధికంగా వుంటుంది. ఈ డోనార్ ఎంబ్రియోస్ శీతలీకరించబడి ఉండటంతోపాటుగా తమ కుటుంబంలో చిన్నారులను చూడాలనుకునేవారికి ఆశాకిరణంగా ఉంటాయి.
‘‘ఎంబ్రియో డొనేషన్ విజయశాతం ఐవీఎఫ్/ఐసిఎస్‌ఐ సైకిల్స్‌లో పోలిస్తే దాదాపు 10-15 శాతం అధికంగా వుంటుంది. హైదరాబాద్‌లోని మా సెంటర్‌ను ఐవీఎఫ్/ఐసీఎస్‌ఐకు వెళ్ళే రోగులలో దాదాపు 2-3 శాతం జంటలు ఎంబ్రియో డొనేషన్ కోరుకుంటున్నారు. అంతేకాదు, ఈ చికిత్స కోసం వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ ఎంబ్రియోకు జన్యుపరంగా గ్రహీతతో ఎలాంటి సంబంధం లేకపోవచ్చు కానీ జన్మించిన బిడ్డకు మాత్రం కచ్చితంగా బయోలాజికల్ కనెక్షన్ తల్లితో ఉంటుంది. అందువల్ల ఆమె బేబీని తన గర్భంలో మోయవచ్చు. బయలాజికల్‌గా ఓ చిన్నారికి జన్మనివ్వడానికి మరో అవకాశం లేని పరిస్థితుల్లో మేం తరచుగా మా రోగులను కౌన్సిల్ చేసి ఎంబ్రియోలను స్వీకరించాల్సిందిగా చెబుతుంటాం’’ అని డాక్టర్ సరోజ జోడించారు.
ఎంబ్రియో డొనేషన్ అనేది మహిళలు గర్భం దాల్చే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో అంగీకరించతగిన విధంగా మారింది. బిడ్డ జన్మించడానికి మునుపు బిడ్డతో అనుబంధం ఏర్పడటంతోపాటుగా తరువాత కూడా అనుబంధం కొనసాగడానికి ఇది దోహపడుతుంది. సంతానలేమితో బాధపడుతున్న రోగులకు ఈ పద్ధతి అత్యంత సులభమైనదిగా నిలువడమే కాదు ఆర్థికంగా ఖర్చు తక్కువలో కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా అత్యుత్తమ ప్రెగ్నెన్సీ ఫలితాలు దీనిలో కనిపిస్తాయి.
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ
ఇన్‌ఫర్టిలిటీ రంగంలో భారీ సర్వీస్ ప్రొవైడర్లలో నోవా ఐవీఐ ఫెర్టిలిటీ(ఎన్‌ఐఎఫ్) ఒకటి. అత్యాధునిక అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఆర్ట్)ని భారతదేశానికి ఐవీఐ, స్పెయిన్ భాగస్వామ్యంతో తీసుకురావడానికి ఎన్‌ఐఎఫ్ కృషిచేస్తోంది. ఈ భాగస్వామ్యం నోవా ఐవీఎఫ్ సేవలు మరియు టెక్నాలజీకి చెప్పుకోతగ్గ ఎడిషన్ ద్వారా వచ్చింది. దీనిలో ప్రొప్రైటరీ సాఫ్ట్‌వేర్, శిక్షణ మరియు క్వాలిటీ మేనేజ్‌మెంటు ఉన్నాయి. ఐవీఐ యొక్క విస్తృతమైన అంతర్జాతీయ అనుభవం, నైపుణ్యం, ఎన్‌ఐఎఫ్ యొక్క అసాధారణ ప్రమాణీకరణ విధానాలు, ప్రొటోకాల్స్ మరియు పాలసీలు భారతదేశానికి తీసుకువచ్చారు.
అత్యంత కీలకమైన విధానాలైనటువంటి ఐయుఐ, ఐవీఎఫ్ మరియు ఆండ్రాలజీ సర్వీసెస్ వంటివి అందించటం ద్వారా ఎన్‌ఐఎఫ్ పలు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీలైనటువంటి ఎగ్స్ మరియు ఎంబ్రియొన్‌ని భద్రపరిచేందుకు విట్రిఫికేషన్, ఎంబ్రియోస్కోప్ మరియు ట్రాన్స్‌ఫర్ కొరకు అత్యుత్తమ ఎంబ్రియోస్ ఎంచుకునే పీజిఎస్, యుటేరియస్ సామర్థ్యం తెలుసుకునేందుకు ఈఆర్‌ఏ- అన్ని విధానాలు మరియు ఐవీఎఫ్- ఐసీఎస్‌ఐ ద్వారా గర్భం దాల్చే అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉన్న విధానాలు, మరీ ముఖ్యంగా గతంలో గర్భం విఫలమైన వారిలో సైతం విజయం సాధించడానికి ఉపయోగపడతాయి. ఎన్‌ఐఎఫ్ ప్రస్తుత 16 ఫెర్టిలిటీ సెంటర్లని భారతదేశంలో నిర్వహిస్తోంది.