సంజీవని

క్రిమి దోషాలతో లింఫు గ్రంథుల వాపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తనాళాలలో ఏర్పడిన వలలో రక్తం సంచరించేప్పుడు కొంత ప్లాస్మా కేపిలరీల గోడల నుంచి బయటకు వస్తుంది. అలా రక్తనాళాల గుండా పైకుబికిన ద్రవ పదార్థాన్ని లింఫ్ అంటారు.
ప్రొటీనులు, రక్త కణాలు- కేపిలరీల గోడలలో వున్న రంధ్రాల ద్వారా బయటకు రాలేవు. కాబట్టి లింఫులో ప్రొటీన్లుగాని, ఎర్రరక్తకణాలు గాని ఉండవు. కొన్ని తెల్ల కణాలు మాత్రం కేపిలరీల గోడలనుంచి దూరి బయటకు రావచ్చు.
ధాతువులో వున్న జీవకణాలకు లింఫ్ ఆహార పదార్థాలను, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంటుంది. దీంతో జీవకణ కార్యక్రమాలు జరుగుతాయి. మళ్లీ ఈ జీవకణ వ్యర్థాల్ని లింఫ్ స్వీకరించి లింఫ్ నాళాల గుండా తీసుకుపోతుంది. అవన్నీ చివరకు పెద్ద వీన్ రక్తనాళంలో అంతమవుతాయి.
లింఫ్ నాళాలలో కంతులు వంటివి వున్నాయి. ఇవి లింఫులలో వున్న ప్రమాదకారకాలైన సూక్ష్మజీవుల్ని, ఇతర పరాయి వస్తువుల్ని అరికట్టే జల్లెడలు. ఈ లింఫ్ గ్రంథులు కొన్ని తెల్ల రక్తకణాల్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ లింఫు గ్రంథులు వివిధ శరీర భాగాలలో గుంపులు గుంపులుగా ఉంటాయి. ఇలా గజ్జల్లోనూ, చంకల్లోనూ, మెడలోనూ, ఊపిరితిత్తులలోనూ, కడుపులోను లింఫు గ్రంథుల సమూహాలుంటాయి. క్రిమి దోషాలలో ఈ లింఫు గ్రంథులు వాచి, బాధపెడతాయి. ఇలా ఇన్‌ఫ్లేమ్ అయిన లింఫు గ్రంథిని ‘బ్యూబో’ అంటారు. వరిశెగడ్డ కూడా ఒక రకమైన బ్యూబోనే!