సంజీవని

మహిళలు బరువు తగ్గాలంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో ఊబకాయానికి ఎక్కువగా మహిళలు గురవుతున్నారు. దీనికి గల కారణం మారిన జీవన శైలి విధానమే. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చున్న చోటునుండే విధులు నిర్వర్తించటం, కదలికలు తగ్గిపోవటం, మానసిక స్థాయిలో పెరుగుతున్న ఒత్తిడి ఎక్కువై హార్మోనుల అసమతుల్యత ఏర్పడి ఊబకాయం వస్తుంది. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఇష్టపడి తినడంవలన సైతం లావెక్కడం జరుగుతుంది.
లావెక్కడానికి కారణాలు
గర్భసంచి సర్జరీ ద్వారా తొలగించడం, మానసిక స్థితి ప్రభావము, హార్మోనుల అసమతుల్యత వలన స్థూలకాయం రావచ్చు. భోజనానికి భోజనానికి మధ్య విరామం లేకుండా ఏదో ఒకటి తినడం, పిజ్జాలు, కేకులు, శీతల పానీయాలు, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకొనడం, శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకోవడం. మానసికంగా ఒత్తిడికి గురి అయినపుడు తీసుకొనే ఆహారం మోతాదు ఎక్కువ అవుతుంది. ఫలితంగా లావు కావడం జరుగుతుంది. కొన్ని రకాల మందులవల్ల హైపోథైరాయిడిజంవల్ల బరువెక్కడం జరుగుతుంది.
అధిక బరువు నివారణకు జాగ్రత్తలు
ప్రతిరోజు వ్యాయామం 30 నుండి 45 నిమిషాలు చేయాలి. సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. పండ్లు, పచ్చికూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి. మాంసాహారము, వేపుళ్లు, బేకరి ఫుడ్స్, ఐస్‌క్రీములు, కేకులు, బిర్యాని వంటి జంక్‌ఫుడ్స్‌ను మానివేయాలి. భోజనానికి భోజనానికి మధ్య చిరుతిండ్లను మానివేయాలి. అధికంగా ఉప్పు, స్వీట్లను తీసుకోకూడదు. భోజనంలో ఎక్కువగా పచ్చి కూరగాయలు తీసుకోవాలి. క్యారెట్, కీర, బీట్‌రూట్ వంటి సలాడ్స్‌ను భోజనంతో తీసుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కాయగూరలు తీసుకోవాలి. యోగా నిత్యం చేయాలి. మంచి గురువు సమక్షంలో అభ్యాసం చేసి యోగా చేస్తే ఉపయోగంగా ఉంటుంది. బరువును ఒక నెలలోనే రెండు నెలల్లోనే తగ్గాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.
మందులు
కాల్కేరియా కార్బ్: వీరికి పిరియడ్స్ త్వరగా వస్తాయి. రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజులు అవుతుంటుంది. వీరు చూడటానికి లావుగా వుంటారు. వీరి పొట్ట ముందుకు పొడుచుకొని వచ్చి బోర్లించిన మూకుడులాగా ఉంటుంది. తల పెద్దదిగా ఉంటుంది. చూడటానికి లావుగా కనిపిస్తారు కాని ఫిజికల్ ఫిట్‌నెస్ ఏమాత్రం ఉండదు. మందకొడితనం, బద్ధకంతో ఉంటారు. వీరికి తలమీద చెమటలు ఎక్కువగా వస్తుండటం గమనించదగిన లక్షణం. తలక్రింద తలగడ పెట్టుకుంటే దిండు మొత్తం తడిగా మారుతుంది. వీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి శారీరక, మానసిక లక్షణాలున్నవారికి లావు తగ్గించటానికి కాన్షిట్యూషనల్ మందుగా కాల్కేరియా కార్బ్ బాగా ఉపయోగపడుతుంది.
గ్రాఫయిటిస్: వీరికి పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి. రక్తస్రావం తక్కువగా ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ సమస్య ఉంటుంది. వీరు లావుగా వుండి పొట్ట పెద్దగా ఉంటుంది. వీరు మలబద్ధకంతో, చర్మవ్యాధులతో బాధపడుతుంటారు. వీరికి పిరికి మనస్తత్వం, బద్ధకస్తులు ఏ పని చేయటం చేతకాదు. ఏ నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేరు. డోలాయన మనస్తత్వం. వీరి నోటి మూలాల్లో, చనుమొనల్లో పగుళ్లు వుంటాయి. కాలి గోళ్లు, చేతిగోళ్లు, మందంగా వుండి ఆకారాన్ని కోల్పోతాయి. ఇటువంటి లక్షణాలు ఉండి లావుగా ఉన్నవారు ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
పైటోలక్కాబెర్రి: బరువు తగ్గుటకు ఈ మందు బాగా పనిచేస్తుంది. లావుగా వుండి కీళ్ళనొప్పులతో బాధపడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. వీరికి గొంతుకు ఇరువైపులా గ్రంథులు వాచి ఉంటాయి. మింగటం కష్టంగా మారుతుంది. వీరికి కీళ్ళనొప్పులు ‘కరెంట్ షాక్’లాగా పోట్లతో కూడి వుంటాయి. ఇటువంటి లక్షణాలున్నవారు ఈ మందును వాడుకొని ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.
నక్స్‌వామికా: వీరికి పీరియడ్స్ త్వరగా లేదా ఆలస్యంగా గాని వస్తాయి. రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో నొప్పి అధికంగా ఉంటుంది. కదలకుండా కూర్చుని పని చేసి, జంక్ ఫుడ్ ఇష్టపడేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వీరు కాఫీలు, వేపుళ్లు ఎక్కువగా తీసుకోవటానికి ప్రాముఖ్యత ఇస్తారు. తద్వారా వీరికి సులువుగా ఊబకాయం వస్తుంది. వీరికి కోపం ఎక్కువ, చిరుబుర్రులాడే మనస్తత్వం. వీరు అజీర్ణ సమస్యతో, మలబద్దకంతో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ముఖ్యమైనది.
ఈ మందులే కాకుండా థైరాయిడినం, ప్యూకస్ వెస్కులోసిస్, కాల్కేరియాఫ్లోర్, కాలీమోర్, క్యాలోట్రోఫస్, సెపియా వంటి మందులను డాక్టర్ సలహా మేరకు వాడుకొని స్థూలకాయం నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646