సంజీవని

గుసగుసలు వినండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తనాళాలలో అడ్డంకులవల్ల రక్తప్రసరణ సరిగా జరగక ‘గుండెపోటు’ రావచ్చు. గుండె కండరాలు దెబ్బతినడంవల్ల ‘కార్డియో మయోపతి’ రావచ్చు. అంటే గుండె ముడుచుకుని, రక్తాన్ని నాళాల ద్వారా శరీర భాగాలకి పంపే శక్తి తగ్గుతుంది. కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్, విటమిన్ లోపం, హార్మోన్ ఉత్పత్తులు సరిగా లేకపోవడం, ఆల్కహాల్ సేవనం, కొన్ని మందులు వాడడంవల్ల ‘కార్డియో మయోపతి’ రావచ్చు. కొన్ని సందర్భాలో కారణం తెలీదు.
హార్ట్ ఫెయిల్యూర్ మందులు, విశ్రాంతి ఆహార వ్యవహారాలతో తగదు. అలాంటి తీవ్ర పరిస్థితుల్లో గుండె మార్పిడి
అవసరమవుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాదు చాలా జాగ్రత్తలూ అవసరం. అందుకే దీనిని మనం ప్రాణం నిలపడానికి చివరి చర్యగా భావిస్తుంటాం.
1960లో క్రిస్టియన్ బెర్నార్డ్ మొట్టమొదట గుండె మార్పిడి శస్త్ర చికిత్సని విజయవంతంగా నిర్వహించారు. మనం దాత నుంచి అవయవాలు తీసుకునేప్పుడు అన్ని అవయవాల్ని తీసిన తర్వాత ఆఖరులో గుండెని తీస్తారు. ఎందుకంటే గుండె తీసివేస్తే రక్తప్రసరణ లేక మిగతా అవయవాలు చనిపోతాయి. అలాగే పెట్టేటప్పుడు ముందు గుండె మార్పిడి జరగాలి. తీసిన నాలుగు గంటలలోపు గుండె మరో వ్యక్తిలో కొట్టుకోవడం ప్రారంభించాలి. లేకపోతే గుండె కండరాలు దెబ్బతిని, గుండె పనికిరాకుండా పోతుంది. అందుకే గుండెని తీసిన తర్వాత ఆఘమేఘాలమీద అవతలి వ్యక్తికి అమరుస్తారు. గుండెని తీసుకువచ్చేలోపు స్వీకర్త ఛాతిని శస్తచ్రికిత్స ద్వారా తెరచి, దెబ్బతిన్న గుండెని తీసివేసి, కృత్రిమ హార్ట్- లంగ్ మెషిన్‌కి కల్పుతారు. దాత గుండె రాగానే దాన్ని అమరుస్తారు. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. ఏ అవయవ మార్పిడిలోనైనా మందులతో రోగ నిరోధక శక్తిని తగ్గిస్తారు. లేకపోతే మార్చిన అవయవం రిజెక్ట్ అయి పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. మరో ఇబ్బంది ఉంది, అవయవం రిజెక్ట్ కాకుండా మందులు వాడడంవల్ల, ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే హార్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరికీ గుండె మార్పిడిలు చేయరు. ముందు హార్ట్ ఫెయిల్యూర్‌ని అందుకు కారణమైన కరొనరి ఆర్టెరీ డిసీజ్, అధిక రక్తపోటు, గుండె కవాటాల జబ్బులు లాంటివి తగ్గించి, హార్ట్ ఫెయిల్యూర్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాలలో బెడ్‌రెస్ట్ అవసరమవుతుంటుంది. గుండె కండరాల్ని బలపరచడానికి మందులూ వాడతారు. ఇప్పుడు కణ పునరుత్పత్తి విధానంమీద ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. గుండె కండరాలు ‘మూల కణ చికిత్స’ని చేస్తున్నారు. వైద్యం వేగంగా పురోగమిస్తోంది. ఏది ఏమైనా గుండె విషయంలో ఏ ఇబ్బంది కలిగినా నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే వైద్యుడికి చూపించడం అవసరం.

-డా రవికుమార్ ఆలూరి 9848024638