సంజీవని

మధుమేహం.. వేధించే తామర (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:చాలాకాలంగా షుగరు వ్యాధి ఉన్నది. ఇటీవల తామర అంటుకుంది. డాక్టరుగారికి చూపిస్తే షుగరు వ్యాధి మూలానే వచ్చిందని అన్నారు. ఈ రెండికీ సంబంధం ఉన్నదా? వివరంగా చెప్పగలరు?
జి.డి.వి.ప్రభాకర్, నెల్లూరు
మనకు తెలియకుండానే మన శరీరంలోపలి అవయవాలు వాటి వాటి డ్యూటీలు చేసుకుంటున్నాయి. వీటినే జీవనక్రియలంటారు. ఒక్కో అవయవం పనితీరు లోపిస్తే, ఆ అంశానికి సంబంధించిన జీవన క్రియల వైఫల్యం కూడా కారణం అవుతుంది. శరీరంలో ఈ విధంగా జీవన క్రియలు నిరంతరంగా జరుగుతుంటాయి. ఒక్కోసారి సాధారణ స్థితికన్నా తక్కువగానూ, ఒక్కోసారి ఎక్కువగా కూడా జరగవచ్చు. ఉదాహరణకు ‘్థరాయిడ్’ గ్రంథి ఎక్కువ పనిచేయడంవలన ‘హైపర్ థైరాయిడిజం’, తక్కువ పనిచేయటంవలన ‘హైపో థైరాయిడిజం’ వ్యాధులు ఏర్పడుతున్నాయి. ఏ అవయవానికి ఆ అవయవం దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది. అది మనం చెప్తే చేయటం, చెప్పకపోతే ఆగటం లాంటి వ్యవహారం కాదు.
జీవనక్రియల వైఫల్యం (metabaolism - related disorder) వలన శరీరంలో అనేక బలహీనతలు ఏర్పడతాయి. వాటి కారణంగా బాక్టీరియా తదితర సూక్ష్మజీవుల దాడికి శరీరం ఎక్కువ గురి అవుతుంది. ముఖ్యంగా చర్మంపైన షుగరు వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటవౌతూ వుంటాయి. తామర లాంటి వ్యాధులు, చర్మం ఎండినట్టై అకారణంగా దురదల వంటి బాధలు ఏర్పడతాయి.
ఒక తొట్టెలోనో లేక గినె్నలోనో రెండు రోజులపాటు నీళ్ళు నిలవుంచితే ఆ నీళ్ళు పాచిపోతాయి! నీళ్ళను పట్టిన ఈ పాచినే ఆల్గే లేదా ఫంగై అంటారు. జాడీలోంచి తడి గరిటతో ఆవకాయ తీస్తే, ఆ ఆవకాయంతా బూజుపడుతుంది కదా! ఆ బూజునే ఫంగస్/ఆల్గె అంటారు. చర్మంలో తడి ఎక్కువగా ఉన్న భాగాలలో కూడా ఇలానే ఫంగై బాగా పేరుకుంటుంది. దానివలన కలిగే చర్మ వ్యాధిని తామర అంటారు. రెండు తొడల లోపలి భాగాలు, మర్మావయవం దిగువ భాగాలలో వ్యాపించే ఈ చర్మ వ్యాధి చూపులకు తామర పూరేకులవలె వ్యాపించి కనిపిస్తుంది కాబట్టి, దాన్ని తామర అన్నారు.
జీవన క్రియలలో భాగంగా ఈష్ట్‌లోంచి విడివడిన కణాలు ఫంగస్‌గా మార్పిడి చెందుతాయని, షుగరు వ్యాధిలో ఫంగస్ ఎక్కువ కావటానికి కారణం ఇదేననీ చెప్తారు. అలా ఏర్పడిన ఫంగస్ షుగరు వ్యాధివచ్చిన వారి నోటి భాగంలోనూ, గోళ్ళచుట్టూ, రొమ్ముల క్రింది భాగంలోనూ, వ్రేలికీ వ్రేలికీ మధ్యభాగంలోనూ, రెండు పెదిమల మూలాలలోనూ, చంకల్లోనూ, గజ్జల్లోనూ, జననాంగాల్లోనూ, ఇంకా ఇతర స్థలాల్లోనూ వ్యాపిస్తుంది. అపరిమితమైన దురద, ఎర్రగా పొంగిన మచ్చలు వాటి అంచున బూడిద రాసినట్లు తెల్లని సన్నని పొలుసులు ఏర్పడతాయి. స్థూలకాయం ఉన్నవారికి, వేడి శరీరతత్త్వం వున్నవారికి తామర ఎక్కువగా సోకే అవకాశం ఉంది. జననాంగాల దగ్గర ఫంగై వచ్చినపుడు లోపల మంటగా ఉండటం, దురద, ఎర్రగా పొక్కిరావటం, తెల్లని స్రావాలు ఉంటాయి. జననాంగం ముందుభాగంలో తగని దురద, మంట ఉంటాయి. సంసారిక సమయంలో మంట, నొప్పి బాధించవచ్చు.
ఇవన్నీ ఎవరివలనో అంటుకోవాలనే నియమం ఏమీ లేదు. షుగరు రోగులకు సహజంగానే శరీరంపైన ఏర్పడతాయని గుర్తించాలి.
శరీరంలో గ్లూకోజు ఫంగైని పోషిస్తోంది. రక్తంలో షుగరు ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మధుమేహ వ్యాధి వచ్చిన వారి శరీరంలోంచి వెలువడే స్రావాలన్నింటిలోనూ తీపి పదార్థం ఎక్కువగా ఉంటుంది. అది షుగరు ఫంగై (బూజు) పెరగటానికి కారణం అవుతుంది. ముఖ్యంగా జనననాంగాల చుట్టూ ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.
షుగరు వ్యాధిలో శక్తి ఉత్పాదకత తగ్గిపోతుంది కాబట్టి ఈ మాత్రం కొద్ది ఫంగసుని అరికట్టడానికి వ్యాధి నిరోధక శక్తిపైన కూడా దీని ప్రభావం వుంటుంది. అందువలన శరీరం ఫంగస్సుని ఎదుర్కోలేకపోతుంది. ఒకవేళ షుగరు వ్యాధిలో తామర లక్షణాలు ఎక్కువగా ఉన్నాయంటే ఆ వ్యక్తి రక్తంలో షుగరు కంట్రోల్లో లేదని అర్థం.
చర్మంపైన ఫంగస్ వ్యాపించటాన్ని క్యాన్‌డిడియాసిస్ వ్యాధిగా పిలుస్తారు. అది పాదాలు, అరిచేతుల్లోనూ, వ్రేళ్లమధ్యా ఏర్పడినపుడు దాన్ని జశళ్ఘ ఔళజూజఒ అంటారు. జననాంగాల చుట్టూ, గజ్జల్లోనూ వచ్చే తామర వ్యాధిని ళ్ఘశజూజజ్ఘూ ఘఇజష్ఘశఒ అంటారు. నోరు, గొంతులలో కూడా ఇది రావచ్చు. పేగులలోపల కూడా వ్యాపించే అవకాశం వుంది. మూత్రాశయం నుండి మూత్రం నడిచే మార్గంలో కూడా దీని వ్యాప్తి కలగవచ్చు.
తామర వచ్చే శరీర తత్త్వం వున్నవారికి, చెడు చేయని కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార ద్రవ్యాలు, అతి తక్కువ స్థాయి పిండి పదార్థాలు తీసుకొనేవారికి, చలవ చేసే పదార్థాలు తినేవారికీ షుగరు వ్యాధి అదుపులో ఉంటుంది. పచ్చళ్ళు, కారాలు, ఊరగాయలు, పులుపు వస్తువులు ఎక్కువగా తినేవారికి శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ వేడిని తగ్గించుకోవటానికి శరీరం చెమటను ఉత్పత్తి చేస్తుంది. చెమట వలన శరీరం చల్లబడి వేడి తగ్గుతుంది. అందువలన శరీరంమీద చెమ్మ ఎక్కువగా నిలబడి ఫంగసుకి ఆహారం పెట్టి పెంచి పోషించినట్టవుతుంది. షుగరు వ్యాధిలేని వారికి కూడా ఇలా జరగవచ్చు. అందుకని తామర లాంటి ఫంగసు వ్యాధులలో తప్పనిసరిగా వేడిచేసే ఆహార పదార్థాలను వదిలేయటం ఒక అవసరం. ఇలాంటి జాగ్రత్తలను తీసుకోకుండా కేవలం మందులతో తగ్గించాలనుకొంటే అది సాధ్యం అయ్యే పనికాదని మనవి.
ఫంగై వ్యాధుల్లో శరీర పరిశుభ్రత ముఖ్యమైనది. నువ్వుల నూనె ఒళ్ళంతా పట్టించి స్నానం చేస్తే, శరీరం తగినంత స్నిగ్థంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. గరుకుదనం పోయి మృదుత్వం ఏర్పడుతుంది. తడి నిలబడకుండా ఉంటుంది. అందువలన ఫంగస్‌కు సరిగా ఆహారం దొరకక అది త్వరగా మాడిపోయే అవకాశం వుంది. బీరకాయ పీచుతో చేసిన స్కబ్బర్లు ఒళ్లు రుద్దుకునేందుకు మార్కెట్లో దొరుకుతాయి. దానితో తోముకుని స్నానం చేస్తుంటే ఫంగస్ చేరకుండా ఉంటుంది.
స్నానం చేసిన తరువాత ఒళ్ళు తుడుచుకున్నాక, వేరే పొడి తువ్వాలు తీసుకొని దానితో చెమ్మ ఎక్కువగా ఉంటే శరీర భాగాలలో మళ్లీ తుడుచుకోండి. బట్టల్ని తడిపి ఇస్ర్తి చేస్తారు కదా.. అలా చేసిన తరువాత ఆ బట్టలో చెమ్మ మిగిలిపోయి ఫంగస్ పెరిగి ఉంటుంది. ఆ బట్టలను మనం కట్టుకొన్నప్పుడు అది మన శరీరానికి సోకే అవకాశం ఉంది. అలాగే ఫంగస్ వ్యాధి ఉన్నవారు మన బట్టలను వాడితే వారినుంచి మనకూ సంక్రమించవచ్చు. భార్యభర్తలకు ఒకరినుండి ఒకరికి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం కూడా వుంది. అందుకని జాగ్రత్తలన్నీ ఇద్దరూ సమానంగా తీసుకోవాల్సిందే!
రక్తంలో షుగరు సాధారణ స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటే ఫంగస్‌కి చర్మంపైన నిలువ నీడలేకుండా పోతుంది. ఇది మొదటి నివారణ చర్య. చర్మ పరిశుభ్రత రెండవ నివారణ చర్య. వేడి కలగకుండా చూసుకోవటం మూడవ నివారణ చర్య. ఈ మూడూ పట్టించుకోకుండా ఆయింట్‌మెంట్లు టన్నులకొద్దీ పట్టించినా ఏ మాత్రం ప్రయోజనం కలగదన్నమాట!
మేహాంతకరసం, సూర్యకాంత రసం అనే రెండు ఔషధాలు ఈ వ్యాధిలో బాగా పనిచేస్తున్నట్టు మేము గమనించడం జరిగింది. రక్తంలో పెరిగిన షుగరుని తగ్గించటం, చర్మానికి తగిన రక్షణనివ్వటం ఈ రెండు మందుల వలన సాధ్యం అవుతుంది. ఈ మందులు మీకు దగ్గరగా ఉన్న ఆయుర్వేద మందుల షాపులలో దొరికే అవకాశం వుంది.
షుగరు వ్యాధిలో చర్మ సంరక్షణ ముఖ్యమైన విషయం. అది అశ్రద్ధ చేయవలసిన విషయం కాదు. అన్ని విధాలా ఫంగసుని జాగ్రత్తగా ఎదుర్కోకపోతే అంత సులభంగా అది చర్మాన్ని వదిలివెళ్ళే రకం కాదని గుర్తుంచుకోండి.
**
డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు,