సంజీవని

ఆందోళనకర స్థాయిలో అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యధికంగా దీర్ఘకాలిక అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సిఒపిడి) వ్యాధిగ్రస్తులు గల దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ వ్యాధి ఆయా దేశాల పౌరుల ఆరోగ్యంపై ప్రభావం చూపడమేకాదు, ఆ దేశాల ఆర్థిక హోదాకు అదనపు భారంగా మారుతుంది. వైద్య శాస్త్ర ప్రకారం దీర్ఘకాలిక అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఒపిడి) ప్రాణాంతక పరిస్థితి కావడంతోపాటు దానివల్ల సంభవించే మరణాలతోపాటు ఇతర రోగాలను సహజంగా తక్కువ అంచనా వేయడం జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో బహిర్గతం కావు. క్రమంగా పెరిగి పరిస్థితి విషమించే వరకు గాని బయటపడదని జాతీయ సూక్ష్మ ఆర్థిక, ఆరోగ్య రంగాల కమిషన్ (ఎన్‌సిఎంహెచ్) నిర్థారించింది. సిఒపిడి అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉన్నదని ఎన్‌సిఎంహెచ్ అధ్యయనంలో తెలిపింది. 2006లో 1.7 కోట్ల మంది భారతీయులు ఈ వ్యాధితో బాధపడుతుండగా, 2016లో అది 2,.2 కోట్లమందికి చేరుకున్నది. ఈ వ్యాధి ఎక్కువగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో ప్రబలంగా వ్యాపిస్తుంది. రోజురోజుకు వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
కునాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్- సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రద్యూత్ వాఘ్రే ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘గ్రామీణ భారతంలోని స్ర్తి పురుషులు ముతక పొగాకుతో తయారుచేసిన చుట్టలు, పొగాకు నమలడం అలవాటుగా చేసుకున్నారు. వారి ఆరోగ్యం విషమించే వరకు, పరిస్థితి చేయి దాటేవరకు ఆరోగ్య పరిస్థితులు, లక్షణాలను గమనించి అందుకు అవసరమైన వైద్య సాయం తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఛాతిలో నొప్పి వచ్చినా, నిరంతరం దగ్గుతున్నా, శ్వాస బరువుగా తీసుకునే పరిస్థితి వచ్చినా వెంటనే ఫిజిషియన్‌ను సంప్రదించి తగు వైద్య సలహాలు పాటించాలి’ అన్నారు. అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాల్లో 90 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం సిఒపిడితో బాధపడుతూ మరణిస్తున్న వారిలో అత్యధికులు భారతీయులు. కొన్ని ఆఫ్రికా ఖండ దేశాల పౌరులే. భారతదేశంలో సిఒపిడి మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉన్నది. భారత్‌లో స్ర్తి పురుషుల్లో ప్రతి లక్షమందిలో 65 మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో 20 శాతం. 50 ఏళ్ళ వయస్సుగల వారి మరణాల్లో రెండో స్థానంలో ఉన్న దేశం భారత్. మహారాష్టల్రో అత్యధికంగా సిఒపిడి కారణంగా మరణిస్తుండటం ఆశ్చర్యంగా వున్నది. హైపర్ టెన్షన్, వెయిట్ లాస్, యాంగ్జైటి, డైస్లిపిడిమియా తదితర ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నది. దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల పౌరులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలకు కారణమవుతున్నది. డిజబిలిటీ అడ్జెస్టెడ్ లైఫ్ ఇయర్స్ (డిఎఎల్‌వై)లో అంతర్జాతీయంగా 12వ స్థానంలో నిలిచిన భారత్, 2020 నాటికి ఐదో స్థానానికి చేరుతుందని అంచనా.
సిఒపిడి దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుంది. ధూమపానం, పొగాకు సేవనానికి దూరంగా ఉండటమే పరిష్కార మార్గం అని డాక్టర్ ప్రద్యుత్ వాఘ్రే వ్యాఖ్యానించారు. 2011లో సిఒపిడి వల్ల రూ.35 వేల కోట్ల ఆర్థిక భారం పడితే, అది ఈనాటికి రూ.48వేల కోట్లకు చేరుకున్నది.