సంజీవని

రొమ్ము కేన్సర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలలో రొమ్ము కాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది ఎందుకు వస్తోందో ఎవరికీ తెలీకపోయినా, రొమ్ము కాన్సర్ ఎందుకు ఎక్కువవుతుందో తెలుసుకోవలసిన అవసరం ఎంతో వుంది.
భారీకాయం, క్రొవ్వులెక్కువగా ఉండే ఆహారాన్ని తినడం కూడా బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ ఫాక్టరే! రేడియేషన్ కూడా! హార్మోన్ రీప్లేస్‌మెంట్‌వల్ల ఈ కేన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కుటుంబ చరిత్ర వున్నా జాగ్రత్తపడాలి.
తరచు చికిత్స చేయించుకోవడం చాలా అవసరం. స్నానం చేసేప్పుడు రొమ్ముల్ని చేతులతో తడిమి చూసుకుంటుండాలి. గడ్డలులా అనిపిస్తే వెంటనే వైద్యులని కలుసుకోవడం అవసరం.
కొన్ని సందర్భాలలో కాన్సర్ కణాలని గుర్తించడంతో రొమ్ములో కొంత భాగాన్నో, పూర్తిగానో తీసివేయాల్సి రావచ్చు. దాంతో మరింత వేదనకి గురవుతారు. అవసరం లేదు. ఇప్పుడు శస్తచ్రికిత్సలో దెబ్బతిన్న భాగానే్న తీస్తారు. చర్మం, కణజాలాన్ని ఎంతవరకు కాపాడగలిగితే అంతవరకూ కాపాడతారు.
రొమ్ముని పునర్నిర్మాణం కూడా చేస్తున్నారు. వచ్చిన కాన్సర్ రకాన్ని బట్టి ‘మాస్టెక్టమి’ ఉంటుంది. సిలికాన్ జల్‌ని లోపల ఉంచి రొమ్ములు మామూలుగా కనిపించేలా చేయవచ్చు.
ఒకవేళ ఆ ప్రాంతంలో చర్మం, కండ తగినంతగా లేకపోతే శరీరంలోని ఇతర ప్రాంతాలనుంచి తీసుకువచ్చి అక్కడ అమరుస్తారు. రొమ్ములు మామూలుగా ఉన్నట్లే పునర్నిర్మాణం చేస్తారు ప్లాస్టిక్ సర్జన్.
కాబట్టి కాన్సర్ ఏ రకమైనవైనా కావచ్చు- మనం అనాకారితనం వచ్చిందని బాధపడనక్కర్లేదు. కావలసిన విధంగా దెబ్బతిన్న ప్రాంతాన్ని ప్లాస్టిక్ సర్జరీతో పునర్నిర్మింపచేసుకోవచ్చు. కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండి తగ్గించుకోవచ్చు. చికిత్సలో పునర్నిర్మింపచేసుకోవచ్చు ప్లాస్టిక్ సర్జరీతో. ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు వైద్యరంగంలో ఓ వరం.