సంజీవని

భయం భయంగా ఉంటోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్షలొస్తున్నప్పుడు చాలామంది పిల్లల్లో భయం భయంగా ఉంటుంది.
ఉద్యోగం వచ్చేవరకూ యువతకు ఇంటర్వ్యూలంటే భయం భయంగా ఉంటుంటుంది. పెద్దలూ చాలా సమయాల్లో డిస్టర్బ్ అవుతుంటారు.
చచ్చిపోతాననే భయంవల్లా భయం!
సుఖంగా నిద్రపట్టదు. అన్నీ భయంకరమైన కలలు. హఠాత్తుగా నిద్రలో లేచి కూర్చుంటారు. మళ్లీ నిద్రపట్టదు. మనసు నిండా భయం! పగలల్లా ప్రసన్నంగానే ఉంటారు. రాత్రివేళలోనే ఇలా భయపడతారు.
అనవసరమైన అనుమానాలతో పీడింపబడుతుంటారు.
మానసిక స్థాయిలోని అస్వస్థలివన్నీ! రోగ నిర్థారణ కోసం ఎన్ని పరీక్షలు చేయించినా ఫలితముండదు. సమకాలీన సమాజంలో వ్యక్తి భౌతికంగా భయం భయంగా బతకాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మానసికంగా భయం, భయంగా బ్రతకడం ఆరోగ్యానికి మంచిది కాదుగా! అందుకనే ఇలాంటి ఇబ్బందులున్నప్పుడు సైకియాట్రిస్ట్‌ని కలవడం అవసరం. శరీరానికి ఎన్ని రకాల జబ్బులున్నాయో మనసుకీ అన్ని రకాల జబ్బులు రావచ్చు. అన్నింటిని ‘పిచ్చి’ అని ఒకే గాటికి కట్టేయకూడదు. సకాలంలో మానసిక జబ్బులకూ చికిత్స అవసరం.

-డా పి.బి.ఎన్.గుప్త, సైకియాట్రిస్ట్..