సంజీవని

చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెప్టేట్ యుటిరస్ వుంటే హిస్టిరోస్కోపీ ద్వారా సరిచెయ్యవచ్చు. పుట్టుకతో వచ్చే గర్భాశయ నిర్మాణ లోపాలలో కొన్నిటిని సరిచెయ్యలేము. సర్విక్స్ వదులుగా ఉంటే గర్భం వచ్చాక బిగుతుగా చెయ్యడానికి కుట్లు వెయ్యొచ్చు. క్రోమోజోన్స్ జెనెటిక్ కారణాలు ఉంటే సాధారణ చికిత్సకు అవకాశం లేదు. అలా అని అన్నిసార్లూ ఈ లోపాలతో గర్భస్రావమవుతుందనీ చెప్పలేము.
ఏంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ ఉంటే తక్కువ మోతాదు ఏస్పిరిన్, తక్కువ మోలిక్యులర్ వెయిట్ హిపరిన్ ఇంజెక్షన్లను గర్భం వచ్చాక రోజూ ఇవ్వడం ద్వారా పరిస్థితిని మెరుగుపరచచ్చు.
డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచడం, హైపోథైరాయిడిజమ్ ఉంటే థైరాయిడ్ హార్మోన్‌ని ఇవ్వడం, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉంటే హార్మోన్స్ సంతులనానికి ప్రయత్నించడం, పెల్విక్ ఇన్‌ఫెక్షన్లు ఉంటే చికిత్స చెయ్యడం సానుకూల ఫలితాలనిస్తాయి.