సంజీవని

ఎలర్జీతో ఊపిరి సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆస్తమా’ అంటే శ్వాసనాళాలలో ముఖ్యంగా బ్రాంకియోల్స్ ఇన్‌ఫ్లేమ్ కావడం. ఇది సాధారణంగా ఎలర్జీవల్ల కలుగుతుంది. మనం పీల్చిన గాలి లోపలికి వెళ్ళేటప్పుడు ఎలర్జీవల్ల కానీ, ఒత్తిడివల్ల కానీ బ్రాంకియోల్స్ లోపలి పొర వాస్తుంది. మ్యూకస్ పేరుకుపోతుంది. బ్రాంకియోల్స్ ముడుచుకుపోతాయి. గాలి ప్రసరించే తోవ ముడుచుకుపోతుంది. శ్వాసించడం కష్టమవుతుంది. గురకలా వస్తూంటుంది, దగ్గూ రావచ్చు.
ఇలాంటి ఇబ్బంది కొన్ని నిమిషాలు ఉండవచ్చు. ఒక్కోసారి కొన్నివారాలూ ఉండవచ్చు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ప్రాణహాని జరుగదు. చిన్నపిల్లల్లో ఆ ఆస్తమా ఎక్కువగా కనిపిస్తుంది.
పిల్లల్లో శ్వాసిస్తున్నపుడు ఇలా ఇబ్బంది, గురక లాంటి శబ్దం వినిపిస్తున్నపుడు బాధా అనిపిస్తుంది. వారు పెరిగేకొద్దీ ఆ సన్నని బ్రాంకియోల్స్ పెద్దవై క్రమంగా ఈ గురకలాంటి శబ్దం తగ్గిపోతుంటుంది.
ఆస్తమా వంశపారంపర్యంగా వస్తుంది. ఇది ఎలర్జీవల్ల కలిగే అనారోగ్యం కాబట్టి, ఒక్కోసారి చర్మంమీద ఎగ్జిమా వ్యాధితో కలిసి బైటపడుతుంది. జ్వరం కూడా వస్తుంది. ఆస్తమా శ్వాసకు సంబంధించిన సమస్య. కానీ, వయసు మళ్లినవారిని రాత్రిళ్లు ఎక్కువగా బాధపెడుతుంటుంది. కార్డియాక్ ఆస్తమా అని ఏమో అనిపిస్తుంది.
ఆస్తమాతో చాలాకాలం బాధపడుతుండటంవల్ల ‘క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ ఎయిర్‌వేస్ డిసీజ్ (సిఒఎడి)’ కలగవచ్చు.
దుమ్ము, ధూళిలో ‘మైట్స్’ అనే సూక్ష్మజీవులుంటాయి. లోపలికి గాలిని పీలుస్తున్నపుడు ఇవి ప్రవేశిస్తాయి. శ్వాసనాళాలలోకి పూలమీదుండే పుప్పొడి రేణువులు గాలితోపాటు శ్వాసనాళాలలోకి వెళ్లి ఎలర్జీ కలిగిస్తాయి. మనం ఇళ్లల్లో పెంచుకొనే కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువుల జుట్టు గాలిలోపలికి వెళ్లినపుడు ఇబ్బంది కలుగుతుంది. వీటిపట్ల జాగ్రత్తగా వుండడం అవసరం.

-డా బి.శ్యామసుందరరాజు శ్వాసకోశ వైద్యనిపుణులు