సంజీవని

ఆహారపు అలవాట్లు.. అనారోగ్యానికి మెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధూమపానంవల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. సన్నటి రక్తనాళాలు మూసుకుపోతాయి. గుండెజబ్బులు, కాన్సర్, బ్రాంకైటిస్, అల్సర్స్ లాంటి అనారోగ్యాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. అంతేకాదు, కాళ్ల పాదాలపైన నల్లబడి, సన్నబడి బర్జర్స్ డిసీజ్ అనే వ్యాధి చిన్న వయసునుంచే పొగ త్రాగే అలవాటువల్ల రావచ్చు.
కొంతమందికి చాలాకాలంగా పొగ త్రాగే అలవాటుంటుంది. నా ఆరోగ్యం దెబ్బతినలేదంటుంటారు. అంతేకాదు చాలాకాలం నుంచి ఉన్న అలవాటుని హఠాత్తుగా మానివేయడంవల్ల కొత్త ఇబ్బందులు కలగవచ్చని భయపడుతుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నాళ్లనుంచి అలవాటున్నా, ఇరవై అయిదేళ్ళపైనుంచి అలవాటున్నా ధూమపాన అలవాటును పూర్తిగా మానేయాలనుకోవడం మంచి నిర్ణయమే. అలా మానేయడంవల్ల తాత్కాలిక లాభాలు, శాశ్వత లాభాలూ కూడా కలుగుతాయన్నది నిజం. పొగ త్రాగడంవల్ల అంతవరకూ మాకేమీ ఇబ్బంది లేదని మీరనుకున్నా, మానేసిన తర్వాత కొంత ఉపశమనాన్ని మీరు ఫీల్ కాక తప్పదు.
శ్వాసలో ఇబ్బంది తగ్గినట్లనిపిస్తుంది. తినే ఆహార రుచి బాగా తెలుస్తుంది. కాన్సర్, అల్సర్, గుండె జబ్బులు, బ్రాంకైటిస్ లాంటి జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ధూమపానం మానివేసిన తర్వాత ప్రతీ సంవత్సరం రకరకాల అనారోగ్యాల నుంచి దూరమవుతారు.
పొగ త్రాగకముందున్నంత ఆరోగ్య స్థాయికి ఊపిరితిత్తులు చేరుకోకపోయినా, చాలా ఇబ్బందులు తగ్గుతాయనడంలో సందేహం లేదు. కాబట్టి ఎన్నాళ్లనుంచి అలవాటున్నా- ఏ రోజు మానేయాలనుకున్నా అది మంచిరోజు! నేను చాలాకాలం నుంచి ఈ అలవాటుతో ఉన్నా ఇబ్బంది లేదనేవాళ్ళు తెలుసుకోవాల్సిన మాట- రోగ నిరోధక శక్తితో ఉన్నన్నాళ్లూ ఏ ఇబ్బందులూ రావు. రావడం ప్రారంభిస్తే వరుసగా ఇబ్బంది పెడతాయి. ఏ రోజున మానివేస్తే ఆ రోజునుంచి అపాయం జరగడం తగ్గి ఆరోగ్యం పుంజుకోవడం మొదలవుతుంది.
వంశపారంపర్య కారణాలవల్ల కొన్ని జబ్బులు వస్తాయి. వాటిని అరికట్టలేం. కానీ మన అలవాట్లవల్ల మనం ‘కోరి - కొనుక్కొని’ తెచ్చుకునే రిస్క్‌లను, ఆ అలవాటుని దూరం చేసుకోవడంతో అనారోగ్యాన్ని దూరం చేసుకోగలం. ఈ విషయం ఆలోచించండి.
ఎంతోకాలంనుంచున్న అలవాట్లని మానుకోవడం కష్టమైనా, అసంభవం కాదు. ముఖ్యంగా యువతీ యువకులు ఇలాంటి దురలవాట్లకి దూరంగా ఉండాలి. వాళ్ళకెంతో భవిష్యత్తుంది. ఆ భవిష్యత్తంతా అనారోగ్యమయం కాకూడదు. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడంవల్ల ఇబ్బంది వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబానికే కాదు దేశానికి కూడా!