సంజీవని

వేసవిలో వేధించే .. పైల్స్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంవలన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి శరీరంలోని భాగాలు పొడిబారిపోతాయి. దీంతో మలవిసర్జన కష్టంగా మారును. మలవిసర్జన సాఫీగా జరగనపుడు ముక్కడంవలన మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు ఒత్తిడికి గురై ఉబ్బుతాయి. కొన్ని సందర్భాలలో రక్తస్రావం కూడా జరుగును.
పైల్స్ (హీమరాయిడ్స్)లను సాధారణంగా ఆర్షమొలలు అంటారు. పైల్ అంటే గడ్డ అని హీమరాయిడ్ అంటే రక్తస్రావం కావడం అని అర్థం. మొలలు చూడటానికి పిలకలుగా కనబడినా, రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా కనిపిస్తాయి.
ఆర్ష మొలలు (పైల్స్) ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పుకోవ చ్చు. వీటిలో ఒకరకం పైల్స్ మలద్వారం లోపలే ఉండి బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇలా పైల్స్ మలద్వారం లోపల ఉండటంవలన రోగికి పైల్స్ ఉన్న విషయం చాలా రోజుల వరకూ తెలియకుండా ఉంటుంది.
ఇక రెండవ రకం పైల్స్ మలద్వారానికి వెలుపలే ఉంటాయి. ఇవి చేతికి తాకుతుంటాయి. మల విసర్జనకు వెళ్లినపుడు కొన్ని రకాల మొలలు నొప్పి కలిగించును. పడుకున్నపుడు మొలలు లోపలికిపోయి నొప్పి తగ్గును. ఆర్షమొలలు లోపలికి పోతున్నాయి కదా అని అజాగ్రత్తతో మందులు వాడకుండా, డాక్టర్ సలహా తీసుకోకుండా ఉంటే కొన్ని రోజులకు మొలలు మలద్వారం బయట ఎక్కువ సంఖ్యలో తయారై శాశ్వతంగా బయటనే ఉండిపోయి తీవ్రమైన అవస్థలకు గురిచేస్తుంది.
కారణాలు
తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలవిసర్జన సక్రమంగా జరుగక మలబద్ధకం ఏర్పడటంవలన, ఎక్కువసేపు కుర్చీలోనే కూర్చొని కదలకుండా విధులను నిర్వర్తించడంవల్ల, తక్కువగా నీరు త్రాగడంవల్ల, మద్యం అతిగా సేవించుటవల్ల, ఫాస్ట్ఫుడ్స్ వేపుళ్లు అతిగా తినడంవల్ల మాంసాహారం తరచుగా తినటంవలన పైల్స్ సమస్య వస్తుంది.
లక్షణాలు
మల విసర్జన సాఫీగా జరుగక తీవ్రమైన నొప్పి, మంట వుంటాయి. మనుషులు చురుకగా ఉండలేరు. ఎక్కడికంటే అక్కడికి
ప్రయాణాలు చేయలేరు. సుఖవిరేచనం కాకపోవడం వీరిని బాధిస్తుంది. సుఖవిరేచనం కాకపోవటంచే చిరాకుగా, కోపంగా ఉంటారు. అప్పుడప్పుడు విరేచనంలో రక్తం పడుతుంటుంది. మలవిసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట రెండు గంటల వరకు వుంటుంది. మలవిసర్జన సమయంలో మొలలు (పైల్స్) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.
జాగ్రత్తలు
వేసవిలో సహజంగా జీర్ణశక్తి తగ్గుతుంది. కావున సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవటం శ్రేయస్కరం. వేసవిలో ఘనపదార్థాలకన్నా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవటానికి ప్రయత్నించాలి. కారం, నూనె, మసాలా పదార్థాలు బాగా తగ్గించాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుండి 5 లీటర్లు). ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. రోజూ మలవిసర్జన సాఫీగా జరిగేట్లు చూసుకోవాలి. మద్యం అతిగా సేవించుట, ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు, మాంసాహారం, చిరుతిండ్లు తినటం మానుకోవాలి. మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్ చేయాలి.
చికిత్స
వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవటం ఉత్తమం. వ్యాధి ఆరంభంలోనే హోమియో మందులను వాడుకుని ప్రయోజనం పొందవచ్చు. హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో కూడి ముడిపడి ఉంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచించడం జరుగుతుంది కనుక సమూలంగా పైల్స్ వంటి రుగ్మతలనుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646