సంజీవని

ప్రోస్టేట్ గ్రంథి వాపుతో యాతనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రోస్టేట్ సమస్య 40 సంవత్సరాలు పైబడినవారిలో ఎక్కువగా కనబడుతుంది. ప్రోస్టేట్ గ్రంథి పెద్దది కావడంవల్ల ఈ సమస్య వస్తుంది. దీనిని అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకోవాల్సి వుంటుంది.
కారణాలు
- ప్రోస్టేట్ సమస్య అనేది లైంగిక వ్యాధులవల్ల.
- గాయాలు అవటంవల్ల.
- గౌట్ సమస్యవల్ల వస్తుంటుంది.
లక్షణాలు
- మూత్రంలో మంట రావడం
- ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదలవల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి మూత్రం వచ్చుటకు ఆటంకం ఏర్పడుతుంది.
- మూత్రాశయం బాగా నిండినపుడు కొద్ది కొద్దిగా చుక్కల మాదిరిగా బయటకు వస్తుంది.
- మూత్రంలో రక్తం పడుట
- పదే పదే మూత్ర విసర్జన చేయాలనిపించటం.
- మూత్రం ఆపుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయ.
జాగ్రత్తలు
- మూత్రం ఎక్కువసార్లు వస్తుందని నీరు తక్కువగా తాగడం చేయకూడదు.
- మూత్రం వచ్చినా మూత్రవిసర్జన చేయకుండా ఉండటం చేయొద్దు
- ధూమపానం, మద్యపానం మానివేయాలి.
- సాత్విక ఆహారం తీసుకోవాలి.
- ఏదైనా కారణంవల్ల మూత్రం ఆగినపుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
- మూత్రం వచ్చినపుడు మూత్రాన్ని ఆపుకోవడంవల్ల ఇన్‌ఫెక్షన్ అనేది పెరిగి కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతుంది. కావున మూత్ర విసర్జన అనేది ఆపకుండుట మంచిది.
నిర్థారణ పరీక్షలు
అల్ట్రాస్కానింగ్ అబ్డామిన్ ద్వారా ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం, బ్లాడర్, కిడ్నీలమీద దాని ప్రభావం ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు.
యూరోఫ్లోమేటరీ పరీక్ష ద్వారా మూత్రం ఎంత పరిమాణంలో ఎంత వేగంతో వుంది తెలుసుకోవచ్చు. అలాగే బ్లాడర్ గోడల మందాన్ని కూడా అంచనా వేస్తారు.
చికిత్స
హోమియో వైద్యంలో ప్రోస్టేట్‌కు మంచి చికిత్స కలదు. శారీరక మానసిక లక్షణాలను ఆధారం చేసుకొని మందులను ఎన్నుకొని వాడిన మంచి ఫలితం ఉంటుంది.
మందులు
బెరైటాకార్బ్: ప్రోస్టేట్ సమస్యకు ఈ మందు అతి ముఖ్యమైనది. వృద్ధుల్లో వచ్చే ప్రోస్టేట్ సమస్యకు మొదటగా ఈ మందు ఆలోచించాలి. మూత్రం ఎప్పటికి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మూత్రం పోసిన అనంతరం కూడా మరలా మరలా మూత్రం వచ్చినట్లుగా అనిపించుట, మూత్రం మంటగా అనిపిస్తూ ఉండుట. ఈ మందు యొక్క ముఖ్య లక్షణం ఇలాంటి లక్షణం వున్నపుడు ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
డిజిటాలిస్: గుండె సంబంధిత వ్యాధి, ప్రోస్టేట్ గ్రంథి వాపుతో బాధపడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. వీరికి శరీరం చూడటానికి వాపు కలిగి వుంటుంది. మూత్రం పోస్తున్నపుడు తక్కువగా వస్తుంది. ఇలాంటి లక్షణాలతో బాధపడేవారికి ఈ మందును వాడుకోవాలి.
స్ట్ఫాగ్రియా: ప్రోస్టేట్ గ్రంథి వాపు సమస్యకు ఈ మందు కూడా చాలా బాగా పనిచేయును. మూత్రం ఎక్కువసార్లు వస్తుంది. మూత్రం పోస్తున్నపుడు పోసిన తర్వాత కూడా మంటగా అనిపిస్తుంది. మూత్రం పోసిన అనంతరం కూడా ఇంకా మూత్రం ఉన్నది అనే భావన కలుగుతుండుట గమనించదగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడుకోదగినది.
సెబల్ సెరులేట: ఈ మందు కూడా ప్రోస్టేట్ గ్రంథి వాపునకు పనిచేస్తుంది. మూత్రం రాత్రి సమయంలో ఎక్కువగా వస్తున్నట్లుగా అనిపిస్తుంది. మూత్రం మంటగా ఉంటుంది. ఈ సమయంలో సెబల్ సెరులేట మాతృద్రావణాన్ని ఉదయం, సాయంత్రం 15 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకొని త్రాగడంవల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు.
కోనియం: ఈ మందు ఏదైనా దెబ్బతగిలిన తరువాత వచ్చే ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు బాగా పనిచేస్తుంది. ప్రోస్టేట్ గ్రంథి వాపుతో కూడి రాయిలాగా గట్టిగా మారినపుడు ఈ మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చు. మూత్రం పోస్తున్నపుడు మధ్య మధ్యలో ఆగుతూ మరలా మూత్రం రావడం గమనించదగిన లక్షణం. ఇలాంటి లక్షణాలున్నపుడు ఈ మందు వాడుకొనిన ప్రయోజనం కలుగుతుంది.
ఈ మందులే కాకుండా ఆర్నిక, ఎకోనైట్, బెలడోన, మెర్క్‌కార్, నక్స్‌వామిక, కాస్టికం, ఆరంమెట్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడుకొని ప్రోస్టేట్ గ్రంథి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646