సంజీవని

గుండె ఎలా కొట్టుకుంటుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బయటనుంచి ఎటువంటి బలం లేకుండా లోపలనుంచే ఒకప్రత్యేక శక్తితో గుండె కండరాలు ముడుచుకోవడం, వ్యాకోచించడం జరుగుతుంటుంది. ఈ వ్యవస్థ మెదడులో ఉత్పత్తి అయ్యే రసాయనాలు స్ఫూర్తిని నరాలలోకి జొప్పించడంతో పనిచేస్తోంది. ఈ వ్యవస్థ ప్రత్యేకమైన న్యూరోమస్క్యులార్ కణాలు సమూహాలుగా ఏర్పడి గుండె కండరాలలోకి పంప్, ఇంపల్సెస్‌తో గుండె కండరాలు ఓ పద్ధతి ప్రకారం లబ్ డబ్ అంటూ ముడుచుకోవడం వ్యాకోచించడం జరుగుతుంటుంది ఒక రిథిమ్ ప్రకారం. ఈ రిథమ్ దెబ్బతింటే ‘ఎరిథ్మియా’ అంటారు.
ఈ శక్తి ప్రసరణకు సైనోయాట్రియల్‌నోడ్, ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్‌లు తోడ్పడతాయి. కుడి ఏట్రియమ్ గోడల్లో సూపీరియర్ వీనాకేవా ప్రారంభం దగ్గరుండే ప్రత్యేక కణ సముదాయాన్ని ‘సైనోఏట్రియల్ నోడ్’ అంటారు. ఇదే గుండె ఫేస్‌మేకర్. ఇక్కడనుంచి ఉత్పత్తి అయ్యే శక్తిలో ఏట్రియల్ ముడుచుకుంటుంది.
ఆ శక్తి అక్కడనుంచి ఏట్రియో వెంటిక్యులార్ కవాటాల దగ్గర గుండె గోడల్లో వున్న ప్రత్యేక న్యూరోమస్క్యులార్ కణజాలానికి చేరుతుంది. దీనిని ‘ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్’ అంటారు. వెంట్రికల్‌లోంచి ఈ శక్తి ప్రవహించానికి సెకుండులో 0.1 సమయం పడుతుంది. ఈ సమయంలో ఏట్రియం ముడుచుకోవడం పూర్తయి వెంట్రికల్ ముడుచుకోవడం ప్రారంభమవుతుంది. ఇది ‘సెకండరీ పేస్‌మేకర్’గా పనిచేస్తుంది.
ఎ.వి.నోడ్ నుంచి ప్రారంభమయ్యే ఫైబర్ సమూహాన్ని ‘ఏట్రియో వెంట్రిక్యూలార్ బండిల్’ అంటారు. ఫైబర్ నిర్మితమైన రింగ్, ఏట్రియా వెంట్రికల్‌లను వేరుచేస్తూ ఉంటుంది. దీంట్లోంచి ఈ బండిల్ వెళ్తుంటుంది. వెంట్రికల్ కవాటం మీద ఈ బండిల్ ఫైబర్స్, కుడి-ఎడమ బండిల్ శాఖలుగా చీల్తాయి. వెంట్రికిల్ గోడల్లో ఈ బండిల్ శాఖలోని ఫైబర్స్ విస్తరిస్తాయి. వీటిని పర్కింజెఫైబర్స్ అంటారు. వీటి ద్వారా గుండె గోడల్లో ప్రవహించే శక్తితో గుండెలో కదలికలు జరుగుతుంటాయి. వీటితోబాటు అటనామిక్ నెర్వస్ సిస్టమ్ కూడా గుండె కొట్టుకోవడానికి తోడ్పడుతుంటుంది.
గుండె కొట్టుకోవడం జాతి, వయసు, అటనామిక్ నెర్వ్ కొట్టుకోవడం, అడ్రినలిన్ థైరాక్సిన్ లాంటి హార్మోన్ల ప్రభావం హృదయ స్పందనలని బట్టి మారుతుంటుంది.
గుండె ముడుచుకోవడాన్ని ‘సిస్టోలిక్’ అని, ఆ తర్వాత మామూలుగా అయిన ప్రతి పోటుని ‘డయాస్టోలిక్’ అని అంటారు. ఈ రెండింటిని కలిపి ‘కార్డియాక్ సైకిల్’ అంటారు. మామూలుగా గుండె ఒకసారి ముడుచుకుని మామూలు కావడం నిముషంలో 60 నుంచి డెబ్భైసార్ల వరకూ జరుగుతుంటుంది. ఈ గుండె కొట్టుకోవడం మనకు మామూలుగా చెవులకు వినిపించదు. ఈ గుండె కొట్టుకోవ డాన్ని వైద్యులు స్టెతస్కోప్‌తో వింటారు. ఈ ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్‌ని ఎలక్ట్రోకార్డియో గ్రామ్ (ఇసిజి)తో రికార్డ్ చేస్తారు. వీటి ద్వారా గుండెలో విద్యుచ్ఛక్తి ప్రవాహ తీరు, సైకిల్స్ మధ్య పట్టే సమయం మయోకార్డియమ్‌ని గురించిన సమాచారం, గుండె పరిస్థితిలాంటివి తెలుస్తాయి.
ఆరోగ్యంగా వుండే గుండె దాదాపు 70 మి.లీ. రక్తాన్ని ముడుచుకున్నపుడు బయటకు నెడుతుంది. నిముషంలో 72 సార్లు అందుకు ముడుచుకుంటుంది. ఎక్కువ రక్తం కావలసిన సమయాల్లో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
గుండె కొట్టుకోవడం మానేస్తే ప్రథమ చికిత్సగా చటుక్కున ‘కార్డియో పల్మొనరి రిసటేషన్’ ప్రారంభించాలి. గుండెమీద ఒక చేతితో మృదువుగా రాస్తూ, నోట్లో నోరు పెట్టి కృత్రిమ శ్వాస కల్పించాలి.
పైనున్న రెండు ఆర్టికల్స్‌లో కొట్టుకునే విధానాన్ని తప్పడాన్ని ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ అంటారు. ఇది ఒక పద్ధతిలో కాకుండా గుండెలో విద్యుత్ ప్రవహించడం వల్ల వస్తుంది. ఎరిర్మియాలో సాధారణంగా ఏట్రియల్ ఫిబ్రలేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. చెమటలు పట్టడం, ఫెయింట్ అవడం, ఛాతీనొప్పి లక్షణాలు. ఒక్కోసారి లక్షణాలూ ఉండకపోవచ్చు. గుండె కొట్టుకునే రేటు పెరిగినా, తగ్గినా కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రావచ్చు. ఆరికల్స్ కదలికలు సరిగా ఉండకపోతే రక్తం పేరుకుపోయి ‘స్టాటిస్’కి కారణమవుతుంది. రక్తంలో గడ్డలు కట్టే స్వభావం ఎక్కువవుతుందన్న మాట! స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాల్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఒకటి. గుండె కొట్టుకునే రేటుని ఎలక్ట్రికల్ కార్డియో వెర్షన్‌తో మామూలు స్థితికి తేవచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌తో బాధపడేవారు రక్తం పలుచన కావడానికి ఎకోస్పిరిన్ లాంటి మందు లు వాడటం మంచిది.
గుండె కొట్టుకునే రేటు సరిగా ఉండేందుకు అమర్చే పరికరం ‘పేస్‌మేకర్’. మామూలుగా గుండెలో ఉండే పేస్‌మేకర్ సరిగా పని చేయకపోతే లేకపోతే నోడ్ దగ్గర పుట్టిన విద్యుత్ వెంట్రికల్ వరకు విస్తరించే మార్గాలలో అడ్డంకులేర్పడినా ఈ కృత్రిమ పేస్‌మేకర్ని అమరుస్తారు.
పేస్‌మేకర్ని బయట నుంచి రోగి గుండె కొట్టుకోవడాన్ని సక్రమంగా చేసి, చర్మం కింద అమరుస్తారు. ఛాతీ గోడల మీద రెండు ఫేసింగ్ పాడ్స్‌ని పెడతారు. ఒక పాడ్‌ని స్టెర్నమ్ పై ప్రాంతంలో, రెండో దానిని లెఫ్ట్ ఎక్సిల్లా దగ్గర ఉంచుతారు. ఎక్సిల్లా గుండె కింది భాగంలో ఉంటుంది. ఒక పాడ్ నుంచి మరో పాడ్‌కి విద్యుత్తరంగాలు ప్రవహించేప్పుడు, మధ్యలోవున్న కణజాలాలు, కండరాలను ఉత్తేజపరుస్తూ వాటి ద్వారా గుండె కండరాలను చేరుతుంటుంది. గుండె ముడుచుకుంటుంది. పేస్‌మేకర్ని అమర్చడం ద్వారా గుండెనే కాదు, ఛాతీ కండరాల్ని స్టిమ్యులేట్ చేయవచ్చు.
గుండె కొట్టుకునే రేటుని తెలుసుకోవడానికి చేతి నాడిని పట్టుకొని చూస్తారు.

డా.రవికుమార్ ఆలూరి చీఫ్ ఇంటర్‌వెన్షనల్, కార్డియాలజిస్ట్, (కిమ్స్) 98480 24638