సంజీవని

ద్రవ పదార్థాలతో అతిసారకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలంలో సాధారణంగా అతిసార వ్యాధి కలుషిత నీటి ద్వారా ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధికి గురైన వారికి ఉన్నట్లుండి వాంతులు, విరేచనాలు అవుతాయి.
కొందరిలో జ్వరం రావడం, విపరీతమైన కడుపునొప్పి, నోరు ఎండిపోవడం, కాళ్లు లాగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా వాంతులు, విరేచనాలు త్వరగా తగ్గించడానికి మందులు వాడాల్సి వుంటుంది.
వ్యాధి లక్షణాలు
- విరేచనాలు, వాంతులు ఉన్నట్లుండి ఒకేసారి పెద్ద మొత్తంలో అవుతాయి.
- తద్వారా శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ స్థితి ఏర్పడుతుంది.
- ఇలాంటి స్థితిలో చర్మాన్ని పైకి లాగి వదిలితే అలాగే ఉండిపోతుంది.
- వృద్ధుల్లో చర్మం ముడతలు పడి ఉంటుంది.
- కళ్లు గుంటల్లాగా ఉండటంతోపాటు చాలా నీరసంగా ఉంటుంది.
- అతిసార వ్యాధి తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నాడి వేగంగా ఉంటుంది.
- కొన్ని సందర్భాల్లో నాడి తెలియకుండా ఉంటుంది.
- రక్తపోటు తగ్గిపోతుంది. రక్తపోటు నమోదు చేయలేని స్థితికి కూడా జారిపోతుంది.
- శరీరం చల్లబడి రోగి అపస్మారక స్థితిలో ఉండి, కోమాలోకి వెళ్లిపోయి మరణం సంభవిస్తుంది.
నివారణ
- అతిసార వ్యాధివల్ల శరీరం నీటిని, లవణాలను అత్యధికంగా కోల్పోతుంది. కనుక ఈ వ్యాధికి గురైన రోగికి వెంటనే ద్రవ పదార్థాలు ఇవ్వాలి.
- కొబ్బరి నీరు, మంచినీరు, మజ్జిగ మొదలైనవి ప్రారంభం నుంచి ఇవ్వాలి.
- డీహైడ్రేషన్ నివారణకు కాచి చల్లార్చిన ఒక గ్లాసు నీటిని రెండు స్పూన్ల పంచదార, చిటికెడు ఉప్పు కలిపి ఇవ్వాలి. లేదా ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వాలి.
-అతిసార వ్యాధికి గురైన వ్యక్తి నోటితో ద్రవ పదార్థాలు తీసుకోగలిగినంత వరకూ సెలైన్ అవసరం రాదు.
- నోటితో ఏమీ తీసుకోలేని స్థితిలో ఇంట్రావీనన్ ద్వారా సెలైన్‌ను డాక్టర్ల సమక్షంలో ఇవ్వవలసి ఉంటుంది.
మందులు.. హోమియో మందులను లక్షణాల ఆధారంగా వాడవలసి వుంటుంది.
పోడోపైలం: నీళ్ళ విరేచనాలు అధికంగా అవుతాయి. విరేచనం కడుపునొప్పి లేకుండా ఉంటుంది. కొద్దిపాటి ఆహారం తీసుకున్నా విరేచనం మాత్రం పెద్దగా అవుతుంది.
ఆర్సినిక్ ఆల్బ్: విరేచనం వాంతులతోపాటు పొట్టలో నొప్పి ఉంటుంది. విరేచనం నలుపు రంగుగా గాని ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. విరేచనం వాంతులు అనంతరం రోగి తీవ్ర మైన నిస్త్రాణకు గురికావడం ఈ మందులో ముఖ్య లక్షణం.
కాంఫర్: అతిసార తీవ్రతవలన రోగి శరీరం చల్లబడిపోతుంది. మలవిర్జన తెలియకుండా ఆకస్మికంగా అవుతుంది. విరేచనం గంజి నీళ్ళలాగా వుంటుంది.
వెరాట్రం ఆల్బం: విరేచనం ఆకుపచ్చగా నల్లగా వుంటుంది. విరేచనం బియ్యం కడిగిన నీళ్లలాగా ఉంటుంది. డీహైడ్రేషన్ వలన రోగి శరీరం ముడుతలు పడి చల్లగా వుంటుంది.
చైనా: తిన్న పదార్థాలు జీర్ణం కాకుండా విరేచనంలో కనిపిస్తాయ. దుర్వాసనతో పెద్ద పెద్ద నీళ్ళ విరేచనాలు అవుతుంటాయి.
ఇపికాక: విరోచనములు, వాంతులు ఎక్కువగా ఉంటాయ. వాంతి వచ్చినట్లుగా ఉండి రోగి ఏమి త్రాగడానికి తినడానికి ఇష్టపడడు.
ఈ మందులతోపాటు మరికొన్ని మందులు నక్స్‌వామిక, మెర్క్‌సాల్, నైట్రంసల్ఫ్, ఫాస్ఫరస్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడినచో అతిసార వ్యాధి నివారణ జరుగుతుంది.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646