సంజీవని

గాయం లోపలా రక్తస్రావం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలి, లోపలి భాగాలు వత్తుకుపోయి రక్తస్రావం జరుగుతుంటుంది. బయటికి జరిగే రక్తస్రావంకన్నా కూడా లోపల జరిగే రక్తస్రావాల వల్ల ప్రమాదం ఎక్కువ.
బయట తగిలే గాయాల రక్తస్రావాన్ని అరికట్టి సరైన చికిత్సతో ఆ గాయాలు తగ్గేలా చూడవచ్చు. లోపల రక్తస్రావాలను వెంటనే గుర్తించి సకాలంలో వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన చికిత్సలో ప్రాణాపాయం జరగకుండా కాపాడవచ్చు.
ప్రమాదం జరిగి బయటకు రక్తస్రావం జరుగుతున్న వాళ్ళ వంటిమీద గాయాలై రక్తస్రావం జరుగుతున్న ప్రాంతాన్ని గుర్తించడంతోబాటు ఇతర ప్రమాద ప్రాంతాల్ని గుర్తించాలి. చర్మం పాలిపోయినట్లు రంగు మారినా విపరీతంగా చెమటలు పడుతున్నా, నాడి నీరసంగా కొట్టుకుంటున్నా, ఆదుర్దాగా వున్నా, అవిశ్రాంతంగా వున్నా, స్పృహ తప్పినా రోగి పరిస్థితి కొంచెం ప్రమాదకరమని భావించాలి. వీన్స్ రక్తనాళాలలో.. ముఖ్యంగా కాళ్ళలో వున్న ఉబ్బిన వారికోజ్ వీన్స్ చిట్లి రక్తస్రావం జరగవచ్చు.
వత్తుకున్నప్పుడు ఆర్టెరీ రక్తనాళాలు క్రింద ఎముకల్ని వత్తుకుని ఆ ప్రాంతం నుంచి రక్తప్రసరణ అడ్డంకి కలుగుతుంది. అటువంటి ప్రదేశాల్ని ‘ప్రెజర్ పాయింట్’ గాయంమీద ఒత్తిడితో రక్తస్రావాన్ని ఆపలేకపోతే అప్పుడు ఇండైక్ట్ విధానంతో ఆపడానికి ప్రయత్నించాలి. గాయానికి డ్రెస్సింగ్ చేయాలి. 15 నిముషాలకన్నా ఎక్కువ ఒత్తిడి గాయంమీద కలిగించకూడదు. అలా ఎక్కువసేపు చేస్తే కణజాలం దెబ్బతినవచ్చు. ఆ అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితి రావచ్చు.
శరీరంమీద కనిపించే గాయాలతో దగ్గు, రక్తవాంతులు కావచ్చు. ఆ ప్రాంతాలలో వాపు రావచ్చు. శరీరం పాలిపోయినట్లయి చల్లపడవచ్చు. విపరీతంగా చెమటలు పట్టవచ్చు. కాలివేళ్ళు, పాదాల వేళ్లు చివరలు నీలంగా మారవచ్చు. నాడి నీరసంగా కొట్టుకోవచ్చు. అవిశ్రాంతతని పొందడంగాని, స్పృహ తప్పడంగాని జరగవచ్చు.
గాయమైన వ్యక్తిని నేలమీద పడుకోబెట్టాలి. గాయం చుట్టూ వున్న వస్త్రాన్ని తొలగించాలి. చేతితో రక్తస్రావమవుతున్న ప్రదేశాన్ని నొక్కిపట్టాలి. గాయంమీద ఏదైనా ఫారెన్ వస్తువుంటే నొక్కకూడదు. వీలైతే గాయ ప్రాంతాన్ని గుండెకన్నా కొద్దిగా ఎత్తులో ఉంచాలి. రక్తస్రావం ఆగగానే స్పిరైల్ గాజు గుడ్డని పెట్టి కట్టు కట్టాలి. రక్తం ఆ గాజు గుడ్డనుంచి బయటకు వస్తుంటే దానిని తీసివేయకూడదు. దాని మీద మరో స్పిరైల్ గాజు గుడ్డని పెట్టాలి. కాలు లేక చెయ్యి గాయమైతే కట్టుకట్టిన తర్వాత పైకి లేపాలి. జాగ్రత్తగా కట్టు కట్టాలి. దెబ్బతిన్న వ్యక్తిని కాసేపు కదలకుండా చూసి తాగడానికి, తినడానికి ఏమీ ఇవ్వకూడదు. వెంటనే వైద్య సహాయం అందేలా చూడాలి. నాడిని చూస్తూ శ్వాస సరిగా అందుతోందో లేదో చూడాలి. అవసరమైతే నోటితో నోటి ద్వారా కృత్రిమ శ్వాసని కలిగించాల్సి వుంటుంది.