సంజీవని

మడమ నొప్పి పోయేది ఎలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత కాలంలో చాలామంది మడమ నొప్పితో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి విధానంవల్ల సరైన పోషక ఆహారం తీసుకోక ఊబకాయం తోడై మడమ నొప్పిని అతి చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నారు. నిత్య జీవితంలో ప్రతి కదలిక మడిమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటంవలన మడిమనొప్పితో కదలికలు కష్టంగా మారుతుంది.
మడమ నొప్పికి కారణాలు
మడమ క్రింది భాగంలో ఉండే ఎముక (కాల్కేనియస్) పదనుగా పెరుగుతుంది. ఫలితంగా పాదం అడుగు భాగంలో నొప్పి కలుగుతుంది.
లక్షణాలు
- ఉదయం నిద్ర లేచిన తరువాత మొదట కదలిక విపరీతమైన నొప్పి ఉండును. కొద్దిదూరము నడిచిన తరువాత నొప్పి తీవ్రత తగ్గుతుంది.
- మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాదము అడుగు భాగాన నొప్పి వస్తుంది.
- పరిగెత్తేటప్పుడు, దిగేటప్పుడు పాదము అడుగుభాగాన నొప్పి వస్తుంది.
- పరిగెత్తేటప్పుడు మడిమ నొప్పి తీవ్రత పెరుగుతుంది.
- ఎక్కువసేపు కిందకూర్చుని పైకి లేచినప్పుడు పాదము అడుగు భాగంలో నొప్పి వచ్చి వేధిస్తుంది.
- మడమ భాగం వాపుతో కూడి ఉండి నొప్పిగా ఉంటుంది. కాలి మడిమకు కింద భాగాన అనుకోకుండా ఏదైనా ఒత్తినట్లయితే నొప్పి భరించలేకుండా ఉంటుంది.
జాగ్రత్తలు
- మడమ నొప్పికి నాటు వైద్యం, పచ్చబొట్లు లాంటివి చేయంచరాదు.
- నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పాదమును వేడి నీళ్లలో ఉంచి అడుగు భాగాన నెమ్మదిగా ప్రెస్ చేయాలి.
- కాలి పాదమును కుడినుండి ఎడమకు, ఎడమనుండి కుడికి తిప్పుతూ నెమ్మదిగా వ్యాయామం చేయాలి.
- వ్యాయామాలు చేసేటప్పుడు ఫిజియోథెరపీ, వైద్యుల సలహాలు తీసుకోవాలి.
- నొప్పి ఉన్నప్పుడు అతిగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా డాక్టర్ సలహా మేరకు హోమియో మందులను వాడుకోవాలి.
- అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుటకు ప్రయత్నించాలి.
- నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువులు ఎత్తుట, పరిగెత్తుట, మెట్లు ఎక్కుట, మెట్లు దిగుట చేయకూడదు.
పరీక్షలు: ఎక్స్‌రే వలన మడమ నొప్పి తీవ్రత తెలుస్తుంది.
చికిత్స
మడమ నొప్పి లక్షణాలను మరియు వ్యక్తిత్వ లక్షణాలు పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను ఎన్నుకొని చికిత్స చేయడం వలన మడమ శూలనుండి ఉపశమనం పొందవచ్చు.
మందులు
లెడంపాల్: వీరికి కాలి పాదాల్లో నొప్పి ఎక్కువగా వాపుతో కూడి ఉంటుంది. వీరు వేడి కాపును భరించలేరు. చల్లని నీళ్లు కాళ్లకు తాకినా మడమ నొప్పి నుండి ఉపశమనం పొందేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
బ్రయోనియా: వీరికి కదలికలవల్ల పాదము అడుగు భాగాన నొప్పి ఎక్కువవుతుంది. విశ్రాంతివల్ల తగ్గటం గమనించదగిన లక్షణము. వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మలబద్ధకముతో బాధపడుతుంటారు. మలము గట్టిగా వస్తుంది. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగ పెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడుకోదగినది.
ఆర్నికా: పడటంవలన పాదం అడుగు ప్రాంతంలో ఎముకకు దెబ్బతగలటం, బెణకటంవలన నొప్పి ఉంటే ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం పాదం నొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
కాల్కేరియా కార్బ్: పాదం అడుగు భాగంలో ఎముక (కాల్కేనియస్) పెరుగుదల వలన నొప్పి వచ్చేవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. వీరు చూడటానికి లావుగా ఉంటారు. వీరి పొట్ట ముందుకు పొడుచుకొని వచ్చి బోర్లించిన మూకుడులాగా ఉంటుంది. తల పెద్దదిగా ఉంటుంది. వీరికి తల మీద చెమటలు ఎక్కువగా వస్తుండటం గమనించదగిన లక్షణం. వీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి శారీరక, మానసిక లక్షణాలున్నవారికి మడమ నొప్పి తగ్గించటానికి ‘కాన్షిట్యూషనల్’ మందుగా కాల్కేరికా కార్బ్ బాగా ఉపయోగపడుతుంది.
రస్టాక్స్: మడమ నొప్పి మొదటి కదలికలో అధికంగా ఉండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉండుట గమనించదగిన ముఖ్య లక్షణం. వీరికి రాత్రి పూట బాధలు ఎక్కువగా ఉంటాయి. చల్లటి, తేమతో కూడిన వాతావరణం వీరికి సరిపడదు. అనుకోకుండా బెణకటంవలన వచ్చే మడమనొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఈ మందులే కాకుండా రూటా, సల్ఫర్, కాలికార్బ్, కోలోసింత్, మాగ్‌ఫాస్, సింఫైటినం, సైక్లోమిన్, కాల్కేరియాఫ్లోర్, కాలీమోర్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల మడమనొప్పి నుంచి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646