సంజీవని

గుండెపోటు వచ్చినవాళ్ళు వ్యాయామం చేయవచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండెపోటు వచ్చి తగ్గినవాళ్ళు వ్యాయామం, జాగింగ్‌లాంటివి చేయవచ్చా అని కొందరి అనుమానం. తప్పకుండా చేయవచ్చు.
గుండెపోటు వచ్చి తగ్గినవాళ్ళకి చాలా ఆసుపత్రులలో కార్డియక్ రిహాబిలిటేషన్ కార్యక్రమాల్ని బోధిస్తుంటారు. వాళ్ళ గుండెని చాలా జాగ్రత్తగా పరీక్షించి, గుండె తట్టుకోగలిగేట్టే వ్యాయామాన్ని చేయమంటారు. ఈ విధంగా వ్యాయామం చేయడంవల్ల మానసికంగా, శారీరకంగా కూడా లబ్ధిపొందుతారు.
మనం ఏ పని చేయలేం, ఎందుకూ పనికిరామనే భయం నుంచి బయటపడి, ధైర్యాన్ని పుంజుకుంటారు. క్రమంగా శరీర పనితీరు పెరిగి, గుండెమీద భారం తగ్గుతుంది. ఒక్కో కొట్టుకోవడంలోనూ గుండె ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తుంది. రక్తంలోంచి కండరాలు ఎక్కువ ఆక్సిజన్‌ని తీసుకుంటాయి. శరీరంలోని పెద్ద కండరాలని ఉపయోగిస్తూ చేసే వ్యాయామాలు వీళ్లకి మంచివి ముఖ్యంగా కాళ్ళ కండరాల్ని ఉపయోగిస్తూ! అందుకే నడక, ఈత, సైకిల్ తొక్కడం, జాగింగ్ లాంటి వ్యాయామాలు మంచివి. వైద్యుడు సూచించిన విధంగా చేయాలి.
గుండెపోటు రోగులకు చెప్పిన వ్యాయామానే్న చేయాలి. మనిషిని బట్టి చెబుతారు. అవి ఆ వ్యక్తికి అనువుగా అనిపించిన తర్వాత అతను లేక ఆమె వాళ్ళంతట వాళ్ళే చేసుకోవచ్చు.
గుండెపోటు వచ్చి తగ్గినవాళ్ళు చేయాల్సిన వ్యాయామాల మీద నేషనల్ హార్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఓ పుస్తకాన్ని ప్రచురించింది. గుండెపోటు వచ్చి తగ్గినవాళ్ళు తమ జీవిత గమనాన్ని ఎలా మార్చుకోవాలన్న విషయం వైద్యుణ్ణి అడిగి తెలుసుకోవాలి.
అంతేగాని గుండెపోటు వచ్చిందని దిగాలు పడిపోకూడదు. మళ్లీ చురుకైన జీవితంలోకి రావడానికి చేసే ప్రయత్నాలే ఈ వ్యాయామాలు.