సంజీవని

వైద్య పరిభాషలో కొన్ని పదాలకు అర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎంజైనా: హఠాత్తుగా ఛాతీలో భారం. పిండేస్తున్న నొప్పి గుండెల్లో కలగడం
* ఎంజైనా పెక్టోరిస్: హఠాత్తుగా గుండెలో పిండేసే నొప్పి, గుండె కండరాలకు ఆక్సిజన్ తగ్గడంవల్ల రావడం
* ఎరిథ్మియా: గుండె కొట్టుకోవడంలో ఉండే రిథిమ్ తప్పడం- ఎక్కువ కావచ్చు- తగ్గవచ్చు.
* ఆర్టిరియల్ స్ల్కీరోసిస్: ఆర్టెరీస్ గోడలు మందమవడం, రక్తప్రసరణని బట్టి రక్తనాళాల గోడలు వ్యాకోచిస్తూ సంకోచిస్తుంటాయి. గోడలు గట్టిపడటం వల్ల స్థితిస్థాపకతని కోల్పోతుంది.
* ఎథిరోస్ల్కీరోసిస్: గుండె నుంచి అవయవాలకు రక్తం సరఫరా చేసే నాళాల లోపలి భాగం (గోడలలో) కొవ్వు పేరుకుపోయి రక్తం సరఫరా చేసే నాళం మూసుకుపోవడం.
* బయాప్సి: కాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి శరీరంలోని అవయవ కణాలను తీసి మైక్రోస్కోప్ క్రింద చూసి నిర్థారించడం.
* కార్సినోజెన్: కాన్సర్‌ని కలిగించే ఏజెంట్- వస్తువు.
* కార్డియోవాస్క్యులర్: గుండె రక్తనాళాలకు సంబంధించిన
* సెరెబ్రల్: మెదడుకి సంబంధించిన
* కీమోథెరపి: కెమికల్ ఏజెంట్స్‌తో చికిత్స
* కంజెనైటల్: పుట్టేప్పుడు లేక గర్భంలో కాని కలిగే అనారోగ్యం
* కంటేజియస్: ఒకళ్ళ నుంచి మరొకళ్ళకు వ్యాపించేది
* కరొనరి థ్రోంబోసిస్: కరొనరి ఆర్టెరీలో రక్తం గడ్డలు కట్టడం
* ఎంబోలిజమ్: రక్తప్రసరణ జరిగేప్పుడు శరీరంలోని ఒక ప్రాంతంనుంచి ప్రవహించి వస్తూ మరో ప్రాంతంలో రక్తనాళానికి లోపల అడ్డం పడటం.. అప్పుడు రక్తం ప్రవహించే దారి సన్నమవుతుంది.
* ఫిట్ లేక కన్వల్షన్:ఎపిలిప్స్ హఠాత్తుగా రావడమో, మళ్లీ రావడమో జరగడం.
* గ్యాస్ట్రోఇంటస్టయినల్: ఆహార నాళానికి సంబంధించిన
* కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్: గుండె కండరాలు బలహీనమై రక్తాన్ని సరిగా పంప్ చేయలేని స్థితి కలగడం. దాంతో ఊపిరితిత్తులు ఇతర అవయవాలలో నీరు పేరుకుంటుంది.
* హెర్నియా: కండరాలు దెబ్బతిని, కొన్ని అవయవ భాగాలు చర్మాన్ని ముందుకు నెట్టుకుని బుడిపెలా వస్తాంయి.
* హైపర్‌గ్లెసీమియా: రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం
* హైపర్ టెన్షన్: అధిక రక్తపోటు
* హైపోగ్లెసీమియా: రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోవడం.
* ఇన్‌ఫెక్షన్: బాక్టీరియా లేక వైరస్ శరీరంలోకి ప్రవేశించడం వల్ల కలిగే స్థితి.