సంజీవని

టైప్-ఎ వ్యక్తులూ.. ఆరోగ్యం జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1959లో కాలిఫోర్నియా కార్డియాలజిస్టులు డా.మేయర్ ఫ్రీడ్‌మన్, డా.రేహెచ్.రోజ్‌నమన్ రెండు రకాల పర్సనాలిటీలు ఉన్నాయని నిర్ధారించారు. చాలా తీవ్రంగా స్పందించి, బాగా బిజీగా ఉండేవాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేసే వాళ్లని, టైప్-ఎ పర్సనాలిటీ వ్యక్తులుగా గుర్తించారు. టైప్-బి పర్సనాలిటీ వాళ్లు అంత పోటీగా జీవించాలని భావించరు. తేలికగా జీవితాన్ని గడిపేస్తుంటారు. టైప్-ఎ వ్యక్తులకు గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తూ గుండెపోటులకు గురవుతుంటారు. టైప్-ఎ పర్సనాలిటీ వ్యక్తులు తమ ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడరు. తలపెట్టిన పని పూర్తయ్యేదాకా విడిచిపెట్టరు. పట్టుదల ఎక్కువ. అందుకే వీళ్లు త్వరగా అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ టైప్ నిర్ధారణ ప్రధానంగా మానసిక ధోరణిని బట్టి ఉంటుంది. పట్టుదల ఉండడం మంచిదే కానీ అనారోగ్యాల్ని ఆహ్వానించడం మంచిది కాదుగా! అందుకే టైప్-ఎ పర్సనాలిటీ వ్యక్తులు ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం.