సంజీవని

మతిమరుపునకు కారణాలు ఇవీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు పెరుగుతున్నకొద్దీ మానసిక సామర్థ్యంకూడా తగ్గిపోతుంటుంది. 65 సం. దాటిన వాళ్ళలో 85 శాతం మంది మతిమరుపుతో బాధపడుతుంటారు. మెదడు లోపంవల్ల కలిగే ‘డిమెన్షియా’కి, దీనికి తేడా ఉంది. మెదడులో కణాలు దెబ్బతినడంవల్ల డిమెన్షియా వస్తుంది.
మెదడులోని ఆర్టెరి రక్తనాళంలో అడ్డంకులేర్పడడం, రక్తనాళం దెబ్బతినడంవల్ల తర్వాతి ప్రాంతాలకి రక్తం అందక కొన్ని కణాలు దెబ్బతినవచ్చు. కొన్నిరకాల అతి సూక్ష్మాతి సూక్ష్మజీవులు (వైరస్) ప్రవేశించి మెదడులోని కణాల్ని దెబ్బతీయవచ్చు. మెదడులోని రసాయనాలలో మార్పు వచ్చి కణాలలో ఒక దానినుంచి మరోదానికి సమాచారం ప్రసారంచేసే పద్ధతి దెబ్బతిని డిమెన్షియా రావచ్చు. మల్టిపుల్ స్క్లరోసిస్ పార్కిన్‌సన్స్ డిసీజ్ హంటిగ్టిన్ డిసీజ్ లాంటి ఇబ్బందులు కలగవచ్చు.
ఈ డిమెన్షియాలలో (మతిమరుపు వ్యాధుల్లో) సాధారణంగా ఎక్కువ మందిలో కనిపించేది ‘‘అల్జీమర్స్ డిసీజ్’’ మతిమరుపుకి సంబంధించింది. ఇన్నిరకాల ఇబ్బందులు కలగడానికి కారణాలు వేరువేరుగా ఉంటాయి. లక్షణాలూ వేరుగా ఉంటాయి.
ఏ రకమైన మతిమరుపు అనేది తెలుసుకోవడానికి మెదడులో కారణాలు తెలుస్తాయి. ఏ ప్రాంతంలో ఎలా దెబ్బతిన్నది మెదడు అనే విషయాల్నిబట్టి నిర్ధారిస్తారు. దానినిబట్టి చికిత్స ఉంటుంది. ఇటువంటి రోగులకు మందులతోబాటు దగ్గరవాళ్ళ ప్రేమతోకూడిన పరిరక్షణ అవసరం.
యాంటి హిస్టామిన్స్ ఎప్పుడు వాడకూడదు?
ఏదైనా ఎలర్జీ వచ్చినప్పుడు, విడవకుండా జలుబు లక్షణాలున్నప్పుడు ‘యాంటి హిస్టామిన్స్’ని వాడతాం. ఈ మందుల్ని వాడగానే ముక్కు ఎండిపోతుంది. జలుబు లక్షణాలు తగ్గిపోతాయి. కళ్ళుకూడా ఎండిపోతాయి. దురద, చర్మం మీద రాషెస్, వాపులు తగ్గిపోతాయి. జలుబుకి మందులు వేస్తే జలుబుని పూర్తిగా ఎలా తగ్గించలేవో, ఎలర్జీ మందులు అలాగే ఎలర్జీని తగ్గించలేవు. కాకపోతే లక్షణాల్ని కనిపించకుండా చేయగలవు.యాంటి హిస్టామిన్స్ ఎన్నో మార్కెట్‌లో ఉన్నాయి. వాటిలో ఏది మీకు సరిపోతుందో తెలుసుకుని దానినే వాడుతుండాలి. ఈ మందులు కొన్నింటిని ప్రిస్క్రిప్షన్ డాక్టర్‌ది ఉంటేనే మందుల షాప్‌లో ఇస్తారు. కాబట్టి వైద్యుడికి చూపించి, ఆయన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ఆ హిస్టామిన్స్ వాడాలి. వ్యక్తినిబట్టి హిస్టామిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్నింటివల్ల కొద్దిపాటి మత్తు ఉంటుంది. కొన్నింటివల్ల చూపు రెండేసిగా కనిపించవచ్చు. చమటలు పట్టవచ్చు. తల తిరగవచ్చు. వాంతులు వస్తున్నట్లనిపించవచ్చు. బ్రాంకియల్ ఆస్థ్రా, గ్లకుమా లాంటి ఇబ్బందులున్నప్పుడు యాంటి హిస్టామిన్స్ వాడవద్దు. యాంటి హిస్టమిన్స్, ఆల్కహాల్‌తో కలిపి వాడవద్దు. ఈ రెండింటివల్ల విపరీతమైన మత్తు వస్తుంది.

-డా.మోహన్‌రెడ్డి ఇఎన్‌టి సర్జన్, నోవా హాస్పిటల్ సెల్: 9963355244