రాష్ట్రీయం

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

8వ తేదీనుంచి 2698 సర్వీసులు

విజయవాడ, డిసెంబర్ 31: ప్రమాదాలను గణనీయంగా తగ్గించుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వుంటున్న ఎపిఎస్ ఆర్టీసీని రానున్న మూడేళ్లలో నయాపైసా అప్పుల్లేని సంస్థగా చూడగలుగుతామని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ నండూరి సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. లాభాల బాటలో పయనింపచేసేందుకు తామంతా సర్వశక్తులూ ఒడ్డుతున్నామన్నారు. వచ్చే సంవత్సరంలో పెద్ద సంఖ్యలో పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను రోడ్డెక్కించబోతున్నామన్నారు. 2014-15 సంవత్సరం నాటికి ఆర్టీసీ రూ.520 కోట్లు నష్టాల ఊబిలో వుండగా గత నవంబర్ మాసాంతానికి అందులో రూ.180 కోట్లు తగ్గించగలిగామని చెప్పారు. ఆర్టీసీ భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నూతన సంవత్సరం ప్రారంభంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 45 కొత్త బస్సులను ప్రారంభించబోతున్నామన్నారు. ఈ ఏడాది సిబ్బంది జీతభత్యాలు పెంచినప్పటికీ రికార్డు స్థాయిలో 180 కోట్ల రూపాయల నష్టాలను తగ్గించగలిగామన్నారు.
ప్రస్తుతం వారానికి నాలుగురోజులు తామంతా విజయవాడలోనే పనిచేస్తున్నామని మరో రెండు నెలల్లో 90 శాతం సిబ్బంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలి రాగలరన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి జనవరి 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 2698 ప్రత్యేక బస్సులను నుడపబోతున్నామని నండూరి సాంబశివరావు తెలిపారు. జంట నగరాల్లోని బిహెచ్‌ఇఎల్, రామచంద్రాపురం, కెపిహెచ్‌బి, ఎస్‌ఆర్ నగర్, ఎల్‌బి నగర్, ఇసిఐఎల్, జీడిమెట్ల తదితర ప్రదేశాల నుంచి విశాఖ, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఇతర రాయలసీమ ప్రాంతాలకు ఈ బస్సులను నడుపుతామన్నారు.