అంతర్జాతీయం

ఫ్లోరిడా కాల్పులు.. విద్యార్థుల్ని కాపాడిన ఇండియన్ టీచర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా స్కూల్‌లో ఈనెల 14వ తేదీన ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. డగ్లస్ స్కూల్‌లో ఆ మారణహోమం జరిగింది. అయితే ఆ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతి టీచర్ శాంతి విశ్వనాథన్ అనేక మంది విద్యార్థులను కాపాడారు. ఉన్మాది కాల్పులు జరుపుతున్న సమయంలో ఆమె సమయస్ఫూర్తి ప్రదర్శించి తన క్లాస్‌రూమ్ విద్యార్థులను రక్షించారు. స్కూల్‌లో రెండవ సారి అలారమ్ వినబడగానే టీచర్ శాంతి అలర్ట్ అయ్యారు. తన క్లాస్‌రూమ్‌లో ఉన్న విద్యార్థులను వెంటనే నేలపై పడుకోవాలని ఆదేశించింది.టీచర్ శాంతి విశ్వనాథన్ సమయస్ఫూర్తి వల్ల అనేక మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.