క్రీడాభూమి

సంతోష్ ట్రోఫీ ఫైనల్‌లో సర్వీసెస్-మహారాష్ట్ర ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, మార్చి 11: సంతోష్ ట్రోఫీ కోసం జరుగుతున్న 70 జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ కోసం సర్వీసెస్, మహారాష్ట్ర జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఈ రెండు జట్లు తమతమ ప్రత్యర్థులపై అనూహ్య రీతిలో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఇంతకుముందు ఈ టోర్నీలో నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన సర్వీసెస్ జట్టు ప్రస్తుతం తొలి సెమీ ఫైనల్‌లో 1-0 గోల్ తేడాతో పటిష్టమైన గోవా జట్టును మట్టికరిపించగా, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు కూడా 1-0 గోల్ తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. అయితే ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్లు సెల్ఫ్ గోల్స్‌తో బోల్తా పడటం వల్లనే సర్వీసెస్, ముంబయి జట్లు ఫైనల్‌కు చేరడం విశేషం.