పాటల రికార్డింగ్‌లో సర్దార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనం సృష్టిస్తోందని వార్తలొస్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది. ఈనెల 20న పాటలను విడుదల చేసి, ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేయడానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఆధ్వర్యంలో పాటల రికార్డింగ్‌ను ప్రారంభించారు. ప్రముఖ గాయని శ్రేయాఘోషల్ పాడిన పాటతో రికార్డింగ్ మొదలుపెట్టిన దేవిశ్రీ త్వరలోనే పాటలను పూర్తిచేసే పనిలో ఉన్నారు. శరత్‌మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. అందాల భామలు సంజన, లక్ష్మీరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.