జాతీయ వార్తలు

రాజ్యసభలో మహిళా ఎంపీ కంటతడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తనకు ప్రాణహాని ఉన్నందున ప్రభుత్వం తక్షణం తనకు తగిన రక్షణ కల్పించాలని అన్నాడిఎంకె పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సోమవారం రాజ్యసభలో విలపించారు. ప్రాణహాని ఉందంటూ ఆమె మాట్లాడడంతో సభ్యులంతా ఒక్కసారి కలవరం చెందారు. సభ్యురాలి ఆవేదనను వినాలంటూ కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ మాట్లాడారు. రక్షణ అవసరమైతే వెంటనే రాజ్యసభ చైర్మన్‌కు సభ్యురాలు చెప్పుకోవాలంటూ డిప్యూటీ చైర్మన్ కురియన్ సూచించారు. శశికళ పుష్ప సభలో కంటతడి పెట్టడానికి ముందే ఆమెను అన్నాడిఎంకె నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సిఎం జయలలిత ప్రకటించారు. దిల్లీ ఎయిర్‌పోర్టులో డిఎంకె ఎంపీ తిరుచ్చి శివపై చేయి చేసుకుని తమ పార్టీ పరువును మంట గలిపినందుకే శశికళను సస్పెండ్ చేస్తున్నట్టు జయలలిత స్పష్టం చేశారు. కాగా, ఎంపీ పదవి నుంచి తప్పుకోవాలంటూ సొంత పార్టీ వ్యక్తులే తనను బెదిరిస్తున్నారని శశికళ ఆరోపిస్తున్నారు.