బిజినెస్

మిర్చి పంటను మింగేస్తున్న తెగుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారుల సూచన

గుంటూరు, జనవరి 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో వేసిన మిరప పంటకు తెగుళ్లు ఎక్కువగా ఆశించాయని, రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా జెమిని వైరస్ (బొబ్బర తెగులు) ఆశించినట్లు వ్యవసాయ అధికారులు శనివారం ఇక్కడ వెల్లడించారు. బొబ్బరి తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ప్రస్తుత వాతావరణం దోమ పెరుగుదలకు అనుకూలంగా ఉండటం వల్ల పైరుపై ఉద్ధృతిగా తెగులు ఆశించిందన్నారు. తెగులు నివారణకు ప్రత్యేక మందులు అందుబాటులో లేనందున సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారానే తెల్లదోమ వ్యాప్తిని నియంత్రించేందుకు రైతులు కృషి చేయాలన్నారు. తెగులు వచ్చిన ప్రాంతంలో రైతులు రసాయన పురుగుమందులపై ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులను అమలుచేస్తే సమర్థవంతంగా అదుపు చేయవచ్చన్నారు. రైతులు విధిగా శుద్ధిచేసిన విత్తనాలను మాత్రమే వాడాలని, కిలో విత్తనాన్ని పది మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందుతో శుద్ధిచేసి మొక్క తొలి దశల్లో రసం పీల్చే పురుగు నుండి కాపాడాల్సి ఉంటుందన్నారు. రైతులు కీటకాలను నిరోధించగలిగే పాలీహౌస్‌లలో పెంచిన ఆరోగ్యవంతమైన నారును పొలాల్లో నాటాలన్నారు. మిరప మొక్కలకు సేంద్రియ ఎరువుల రూపంలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేప పిండి వేయాల్సి ఉంటుందన్నారు. నీటి వనరులు ఉన్నచోట్ల జనుము, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను పండించి భూమిలో కలియదున్నాలన్నారు. మిరప పైరు నాటడానికి రెండు, మూడు వారాల ముందు పైరుచుట్టూ రెండు మూడు వరుసల్లో జొన్న, మొక్కజొన్న వంటి రక్షక పంటలను వేయడం ద్వారా రసం పీల్చే పురుగుల తాకిడి నుంచి మిరపను కాపాడుకోవచ్చని వివరిం చారు. మిరపతోపాటు పత్తి, టమాటా, పొగాకు, వంగ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వంటి ఇతర పంటలకు తెల్లదోమ ఆశించే అవకాశమున్నందున పొలం, గట్లపై కలుపు మొక్కలను తొలగించి పొలాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు.