రాష్ట్రీయం

ఆకాశవాణి న్యూస్ రీడర్ వెంకట్రామయ్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఆకాశవాణి న్యూస్ రీడర్ డీ వెంకట్రామయ్య (78) సోమవారం నాడు కన్నుమూశారు. వెంకట్రామయ్య అంతిమ సంస్కారం మంగళవారం ఉదయం ఈఎస్‌ఐ శ్మశానవాటికలో జరగనుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి వెంకట్రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వివిధ విభాగాల్లో వెంకట్రామయ్య సేవలను సీఎం గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం వెంకట్రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో దాదాపు 30 ఏళ్ల పాటు న్యూస్ రీడర్‌గా, కార్యక్రమ వ్యాఖ్యాతగా, నటుడిగా, నాటక ప్రయోక్తగా, రేడియో రాంబాబుగా, రేడియో జర్నలిస్టుగా లక్షలాది మంది శ్రోతల గుండెల్లో కొలువుదీరారు. హైస్కూలు, కాలేజీ చదువులను గుడివాడలో పూర్తి చేసి, 1962లో బిఎస్సీ డిగ్రీ అందుకున్నారు. 1963లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అనౌన్సర్‌గా చేరారు. వివిధ పత్రికల్లో 80కి పైగా కథలు ప్రచురితమయ్యాయి. కథకుడిగా రెండు కథా సంపుటాలు ముద్రించారు. రెండు నవలలు పుస్తకరూపంలో వచ్చాయి. విమర్శలు, సమీక్షలు వందకు పైగా పత్రికల్లో ప్రచురితమయ్యాయి.