రాష్ట్రీయం

కోడి పందేలకు తెలంగాణ మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం: సంక్రాంతి పండుగ నేపధ్యంలో జరిగే కోడి పందాలకు తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కృష్ణ, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వీరు వారి స్నేహితులతో పందాలను వీక్షించేందుకు పర్యటించనున్నట్ల తెలిసింది. ఇప్పటికే తెలంగాణ పశుసంవర్ధక, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఆయనకు ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పైగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు, స్థానికంగా ఉన్నవారు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తలసాని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంతోపాటు, కృష్ణా జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన వారు తలసానిపై విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసి మరీ విమర్శలు గుప్పించారు. అయితే 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నాడు బేటి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇరువురు సీఎంల మధ్య ఏ విధమైన స్నేహ సంబంధం కలిగి ఉందో ఆ రాష్ట్రంలోని మంత్రుల మధ్య కూడా భీమవరం ప్రాంత వాసులకు అంతటి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాదు తెలంగాణ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలిసారిగా అధికారాన్ని చేపట్టిన సమయంలో భీమవరంలో సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఫ్లెక్సీలను ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా నేటి నుంచి జరిగే సంక్రాంతి కోడి పందాలను వీక్షించేందుకు తెలంగాణ రాష్టమ్రంత్రులు ఫెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు తెలిసింది. పైగా వారికోసం పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌లలోని ప్రత్యేక గదులను కూడా ఏర్పాటుచేసినట్లు సమాచారం.
'చిత్రం...తెలంగాణ మంత్రి కి ఆహ్వానం పలుకుతూ భీమవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ